Home /News /politics /

BIG SHOCK TO AP GOVERNMENT AND SANCHAITHA GAJAPATI RAJU HIGH COURT GREEN SIGNLA TO ASOKH GAJPATHI RAJU NGS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్.. సింగిల్ జడ్జి తీర్పును సమర్ధించిన డివిజన్ బెంచ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ప్రభుత్వానికి వరుస షాక్ లు తప్పడం లేదు. ఎన్నిసార్లు కోర్టులో పిటిషన్లు వేస్తున్నా అవి ప్రభుత్వానికి విరుద్ధంగానే వస్తున్నాయి. తాజాగా మోరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు షాకిచ్చింది.

    ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు మారినా తీర్పు మాత్రం మారడం లేదు. దీంతో అధికార పార్టీకి అన్ని విషయాల్లోనూ షాకులు తప్పడం లేదు. తాజాగా మాన్సాస్‌ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును కొనసాగించాలి అంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఇటీవల అశోక్‌ గజపతి రాజును పునర్‌ నియమిస్తూ సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పి ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు డివిజన్‌ బెంచ్‌ను వేర్వేరుగా ఆశ్రయించారు. సీజే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌లో ఆయా పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లు రెండినీ హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సీజే బెంచ్‌ సమర్థించింది. గతంలో రహస్య ఉత్తర్వులతో అశోక్ గజపతి రాజును తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఆయనను సింహాచల దేవస్థానం చైర్మన్‌గా తొలగించింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించేలా జీవో జారీ చేసింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్నయ్య, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది.

    ఆ ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెచ్ కొట్టివేసింది. వెంటనే అశోక గజపతి రాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

    హైకోర్టు తీర్పు ఇప్పటికే అశోక గజపతి రాజుకు అనుకూలంగా వచ్చినా.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది. మాన్సాస్ ట్రస్ట్ లో మరో కుంపటి రాజుకుంది. రోజుకో రకమైన ట్విస్టులతో.. మాన్సాస్ వ్యవహారం ముదురుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ ట్విస్టులు వస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఈ క్రమంలోనే రోజుకో రకమైన సంచలనాలు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించి రంగంలోకి దిగారు. తననే ట్రస్ట్ చైర్మన్ గా నియమించాలంటూ హైకోర్టులో పిటీషన్ వేసారు. దీంతో ట్రస్ట్ చైర్మన్ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

    అయితే మాన్సాస్ బైలాస్, నిబంధనల ప్రకారం.. వంశపారం పర్యంగా వస్తున్న ట్రస్టులో వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని, వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ చైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతి రాజు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించడంతో.. అశోక్ గజపతి రాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సంచయిత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ, తిరిగి అశోక్ గజపతి రాజుకు ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ మళ్లీ ఇప్పుడు.. ఆనంద గజపతిరాజు రెండవ కుమార్తె.. ఊర్మిళా గజపతిరాజు తనకు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించటం, ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుకు ప్రస్తుతం మరో తలనొప్పిగా మారింది. అయితే తాజా డివిజన్ బెంచ్ తీర్పును పరిశీలించిన తరువాత ఊర్మిళ కూడా షాక్ తప్పకపోవచ్చనిపిస్తోంది..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, AP News, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు