Home /News /politics /

BIG SHOCK TO AP BJP TIRUPATI BY POLL MP CONTESTANT RATNA PRABHA WILL JOIN IN YSRCP NGS TPT

Shock to BJP: బీజేపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి ఆ కీలక నేత.. రివర్స్ అవుతున్న కమలం ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీడీపీని ఆపరేషన్ ఆకర్ష్ తో భయపెట్టాలి అనుకున్న బీజేపీ ప్లాన్ రివర్స్ అవుతోందా..? ఆ పార్టీ నేతలే ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారా..? తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తరువాత బీజేపీలో కీలక నేతలు.. అధికార పార్టీ కండువా కప్పుకోవాలి అనుకుంటున్నారా..? ఈ వార్తలపై బీజేపీ నేతల స్పందన ఏంటి..?

ఇంకా చదవండి ...
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18 

  ఏపీలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా సత్తా చాటాలి అనుకున్నా అసలు డిపాజిట్ దక్క లేదు. పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించినా పరువు నిలవలేదు. తిరుపతి బై పోల్ తరువాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఆ నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నా.. పరిస్థితి ఇప్పుడు రివర్స్ లో కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో బలం పెంచుకోవాలి అనుకున్న కషాయ దళానికి రివర్స్ ఎటాక్ తప్పేలా లేదు. అధికార పార్టీ నేతలు పక్క చూపులు చూడకపోయినా.. టీడీపీ నేతలు కచ్చితంగా బీజేపీలోకి చేరుతారని.. భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు ఆశించారు. టీడీపీ నేతలు బీజేపీలో చేరడం సంగతి అటుంచితే.. కీలక బీజేపీ నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఆ పార్టీని కలవర పెడుతోంది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారనున్నారా అనే సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత ఆమె కొన్నాళ్ల పాటు కనిపించలేదు.

  రత్న ప్రభ నిజంగా వైసీపీ కండువా కప్పుకుంటే అది కేవలం బీజేపీకి మాత్రమే కాదు జనసేనకు కూడా షాకే అవుతుంది. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సమయంలో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి ఆమె జనసేన పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. సోదరిని అని చెప్పిన ఆమె ఇప్పుడుమో వైస్సార్ కాంగ్రెస్ చేరుతున్నట్లుగా వార్తలు రావడం జనసేన అభిమానులను కలవర పెడుతోంది..

  ఇదీ చదవండి: మంగళగిరికి బై బై.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్..! ఆ నేతను ఢీ కొడతారా.?

  రత్న ప్రభ విషయానికి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సీఎం వైఎస్ జగన్ కు ఈ మాజీ సివిల్ సర్వెంట్ అభిమాని అని అందరికీ తెలిసిందే. బీజేపీలో జాయిన్ అయినప్పటికీ వీరి పైనే పొగడ్తలు కురిపించారు. ఈ కారణంగానే ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. 1981 ఏపీ కేడర్ కు చెందిన ఐఎఎస్ ఆఫీస‌ర్ 2018 లో రిటైర్ అయ్యారు.  త‌రువాత 2019లో కా‌షాయ కండువా కప్పుకున్నారు రత్న ప్రభ. అంతకు ముందు 2017లో తొలిసారి క‌ర్ణాట్న‌క మ‌హిళ సిఎస్ గా నియ‌మితులయ్యారు. 1983 ఆమె తొలిసారి బీదర్ కు అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ గా నియ‌మితులైయ్యారు. అప్ప‌టినుంచి దాదాపు 37 ఏళ్లు సుదీర్ఘంగా వివిధ విభాగాల్లో పని చేశారు. 2018 లో రిటైర్ అయ్యారు. రత్నప్రభ తండ్రి చంద్రయ్య, భర్త విద్యాసాగర్ కూడా ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులే.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్.. సంక్షేమ పథకాల అమలుపై ఊహించని ట్విస్ట్

  అయితే ఆమె తనపై వస్తున్న రూమర్లను సోషల్ మీడియా ద్వారా ఖండించారు. ఇటీవల తాను పార్టీ మారబోతున్నట్టు, వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. కానీ ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.. అవన్నీ తన ప్రతిష్టను, బీజేపీపై తనకు ఉన్న విధేయతను దెబ్బ తీయడానికి తప్పుడు ప్రచారాలు మాత్రమే అన్నారు.  ప్రధాని మోదీ, బీజేపీ అనుసరిస్తున్న ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన తాను రాజకీయాల్లోకి అడుపెట్టానని. ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతాను అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  http://

  ఆమె సోషల్ మీడియాలో వివరణ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. ప్రతీ ప్రజాప్రతినిధి అలాగే అంటారని.. పార్టీ మారే వరకు ఇదే మాటు చెబుతారని.. కానీ చివరిలో ప్లేటు ఫిరాయిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటు వైసీపీ వర్గాలు సైతం ఆమె త్వరలోనే కండువా మార్చడం పక్కా అంటున్నారు. ఇతర బీజేపీ నేతలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Tirupati, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు