Shock to AP Government: జగన్ సార్కార్ కు మరో షాక్.. లక్ష జరిమానా..? ఎందుకో తెలుసా..?

ఏపీ ప్రభుత్వానికి షాక్.. లక్ష రూపాయల జరిమానా

one lakh fine on ap government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే పలుసార్లు కోర్టుల ఆగ్రహానికి గురైన ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. లక్ష రూపాయల జరిమానా విధించింది సుప్రీం కోర్టు..

  • Share this:
    one lakh fine to ap Government: ఆంధ్ర ప్రదే (Andhra Pradesh) లో జగన్ సర్కార్ కు ఈ మధ్య వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు (Court)ల నుంచి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. హైకోర్టు (Highcourt) ఆదేశాలను అమలు చేయనందుకు సుప్రీంకోర్టు (Supreme court) లక్ష రూపాయల జరిమానా విధించింది. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ తరువాత ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం ఏపీ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది. భారత దేశంలో ఇప్పటి వరకు మరో ప్రభుత్వానికి తగలని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక కేసులో షాక్ లు తప్పడం లేదు. ఒక్క బెయిల్ కొనసాగించే అంశంలో తప్ప.. దాదాపు ముఖ్యమైన అన్ని తీర్పుల్లో ప్రభుత్వానికి షాక్ లు తప్పలేదనే చెప్పాలి.

    రెండు రోజుల కిందట కూడా.. ఏపీ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) హైకోర్టులో (AP High Court) షాక్ తగిలింది. టీటీడీ పాలకమండలి (TTD New Board) నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రభుత్వం నూతన పాలకమండలి నియమించగా ప్రత్యేక ఆహ్వానితులుగా (TTD Board Special Invitees) 52 మందిని నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వల్ల భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. దీనితో ఏకీభవించిన కోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన 568, 569 జీవోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దేవాదాయ శాఖ చట్టానికి విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. టీటీడీ బోర్డులో 80 మంది కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండటం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. దీంతో హైకోర్టు రెండు జీవోలను రద్దు చేసింది.

    ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు శుభవార్త.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ సందడి

    అంతకముందు అమవాతి ఇన్ సైడర్ ట్రేండింగ్ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లోనూ దెబ్బలు తప్పలేదు. అలాగే ఎంపీ రఘురామ రాజు అరెస్ట్ విషయంలోనూ షాక్ లే ఎదురయ్యాయి. ఇక ప్రభుత్వ పథకాలు.. పేదల ఇళ్ల పంపకాల విషయంలో పలు మార్పులు కోర్టు చేత చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

    ఇదీ చదవండి:ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్ ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాడు.. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్

    ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ఎవరూ ఊహించిన విధంగా ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు (AP Highcourt) సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్‌ చేసింది.

    ఇదీ చదవండి: మహిళ కలలోకి వచ్చిన శివుడు.. ఆమె చెప్పిన పని చేసి షాక్ తిన్న గ్రామస్తులు.. ఏం జరిగిదంటే..?

    ఇవే కాదు పది ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలోనూ.. అంతకముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ విషయంలోనూ.. పలు వివాదాస్పద జీవోల విషయంలోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి తగలనన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏపీ ప్రభుత్వానికి.. తాజాగా ఇప్పుడు లక్ష రూపాయల ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    Published by:Nagesh Paina
    First published: