breaking: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగలింది. అమరావతి భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని పదేపదే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని భావిస్తోంది. కానీ అనుకున్నది ఒకటైతే.. న్యాయస్థానాల్లో మరోలా తీర్పు వస్తోంది.

  • Share this:
    ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్.. టీడీపీకి పెద్ద ఊరట లభించింది. అమరావతి భూముల అంశంలో సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ అంశంపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై జస్టిస్‌ వినిత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. సుదీర్ఘ విచారణ చేపట్టింది. ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం కింద అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టవచ్చని, ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ అంశంపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో చాలా వరకు లోటుపాట్లు ఉన్నాయని, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టానికి అనుగుణంగా దీనిపై విచారణ జరగాల్సి ఉందని ఆయన వాదనలు వినిపించారు. అమరావతిలో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని, మొత్తం వ్యవహారంలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించామన్నారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే ఫిర్యాదులు అందినట్టు దవే సుప్రీంకోర్టుకు తెలిపారు.

    ప్రభుత్వ వాదనలతో.. ప్రతివాద న్యాయవాదులు పూర్తిగా భిన్న వాదనలు వినిపించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని న్యాయవాది ఖుర్షీద్‌ చెప్పారు. ఏ ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌ చట్టం వినియోగంలోకి రాదని కోర్టుకు తెలిపారు. 2014 అక్టోబర్‌ నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చిందని, 14 గ్రామాల్లో 30వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కూడా కథనాలు వచ్చాయని ధర్మాసనానికి వివరించారు. రాజధానిపై 2014 డిసెంబర్‌ 30న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారన్నారు. న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా ఇది నిలుస్తుందని ఖుర్షీద్‌ వాదించారు.

    మరో ప్రతివాది తరఫున శ్యామ్‌దివాన్‌ వాదననలు వినిపిస్తూ.. రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని.. ఆ విషయాన్ని సుప్రీం కోర్టుకు వివరించారు. ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారు. భూములు అమ్మినవారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది అన్నారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం సెక్షన్‌ -55 వర్తించదు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగా జరిగిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థించింది..

    అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగలేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
    Published by:Nagesh Paina
    First published: