Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్.. సంక్షేమ పథకాల అమలుపై ఊహించని ట్విస్ట్

ప్రధాని మోదీ, సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంగా పరిస్థితి మారుతోందా..? ఏపీలో సంక్షేమ పథకాల అమలు తీరుపై కేంద్రం ఫోకస్ చేసిందా..? సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అని ఫీలవుతోందా..? తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఎలా అర్థం చేసుకోవాలి..? దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది.

 • Share this:
  ఏపీపై ప్రత్యేక ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాజకీయంగా వార్ కు తెరలేపినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం భారీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టార్గెట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సైలెంట్‌ వార్‌ మొదలయింది. ఇప్పటికే భారీగా అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది జగన్ సర్కార్. అప్పుల విషయంలో సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. ఈ అంశంలో ఎలాంటి పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 42,742 కోట్ల రుణం తెచ్చుకునేలా పరిమితిని పెంచాలని కేంద్రాన్ని జగన్ కోరగా.. ఇటీవల ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కూడా ఇదే విజ్ఞప్తిని ఆమె ముందుచారు. అయినా ఆర్ధిక శాఖ మాత్రం పరిమితిని పెంచేది లేదని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం కేంద్రం విధించిన నిబంధనలకు లోబడే అప్పులు చేయాల్సి ఉంటుంది.

  సంక్షేమ పథకాల పేరుతో భారీగా అప్పులు చేస్తుండటం, తాము తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే రుణ పరిమితుల్లో కేంద్రం కోత విధించినట్లు తెలుస్తోంది. బీజేపీ సర్కారును ఏపీలో విమర్శిస్తున్న వైసీపీ ప్రభుత్వం. ఢిల్లీలో మాత్రం సఖ్యతగానే మెలుగుతోంది. అయినా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కనబెట్టడం, రుణపరిమితి పెంపుకు అంగీకరించకపోవడంతో రాజకీయంగా గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది కేంద్రం.

  ఇదీ చదవండి: మంగళగిరికి బై బై.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్..! ఆ నేతను ఢీ కొడతారా.?

  రేషన్‌ డోర్‌ డెలివరీ కారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు అనుకున్నంత ప్రచారం రావటం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఉచిత నిత్యావసరాలను తామే ఇస్తున్నట్టు కార్డుదారులకు విధిగా తెలిచేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తమ కోటా నిత్యావసరాలను చౌక దుకాణాల దగ్గరే పంపిణీ చేయాలని మెలిక పెట్టింది. పనిలో పనిగా ఆయా దుకాణాల దగ్గర ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన బ్యానర్లను కూడా విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

  ఇదీ చదవండి: మన క్యాంపస్ లో అరుదైన జంపింగ్ స్పైడర్.. ప్రపంచ ఎనిమిదో వింత అని తెలుసా..

  రేషన్‌ డోర్‌ డెలివరీ కారణంగా కేంద్ర నిత్యావసరాల కోటాకు ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోగా, దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే కేంద్ర కోటా నిత్యావసరాల పంపిణీని చౌక ధరల దుకాణాల దగ్గరే ఇస్తే కేంద్రప్రభుత్వానికి కచ్చితంగా పబ్లిసిటీ వస్తుందని భావిస్తోంది. ఆహార భద్రతా చట్టానికి లోబడి అందించే కోటా కాబట్టి ఉచిత నిత్యావసరాలను కేంద్రం కోరినట్టే పంపిణీకి అంగీకరించక తప్పడం లేదు. ఈ నెల 16 నుంచి ఎక్కడికక్కడ డిపోల దగ్గరే కేంద్ర కోటా బియ్యం పంపిణీ చేయటానికి సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చర్యలు చేపట్టినట్టు సమాచారం. రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ఉచిత రేషన్‌ బ్యానర్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

  ఇదీ చదవండి: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. బిల్లు తగ్గించుకునే ఆఫర్ ఇస్తోన్న APEPDCL

  ఈ పోస్‌ వ్యవస్థ ద్వారా అదనపు ఆదాయానికి బ్రేక్‌ పడి, ఎండీయూ ఆపరేటర్ల ద్వారా స్టాకిస్టులుగానే పరిమితమైన రేషన్‌ డీలర్లకు ఈ బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు పుండుమీద కారం చల్లినట్టు అవుతున్నాయి. మీ పథకాల ప్రచారానికి మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బ్యానర్లు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యానర్ల విషయంలో డీలర్లు పట్టించుకోవటం లేదని తెలిసి సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు డీలర్లే బ్యానర్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశిస్తున్నారంట. మరి దీనిపై డీలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి..
  Published by:Nagesh Paina
  First published: