BIG SHOCK TO ANDHRA PRADESH GOVERNMENT 5 IAS OFFICERS GET PRISON AND HIGH COURT ALSO SLAMS NGS GNT
Big Shock: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్ష.. ఎందుకంటే
ప్రతీకాత్మక చిత్రం
AP High court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తొలిసారి ఒకే రోజు ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష పడింది.. ఏ కేసులో అంటే..?
Shock to AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) వరుస షాక్ లు తప్పడం లేదు. తాజాగా ఎవరూ ఊహించిన విధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు (AP Highcourt) సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. నెల్లూరు జిల్లా (Nellore District)కు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మ (Sai Brahma)కు న్యాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ (EX IAS Manmohan Singh)కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావు ( Collecter Sheshagiri Rao)కు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఐఏఎస్ అధికారి రావత్ (IAS Rawath)కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజు (Mutyala Raju)కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్ ( inthiayz)కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఐదుగురు ఐఏఎస్‌ల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోర్టు ఆదేశించినా కూడా చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పు ఏపీలో సంచలంగా మారింది. గతంలోనూ పలువురు అధికారుల తీరుపై సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే జైలు శిక్ష విధిస్తామని చాలా సందర్బాల్లో అధికారులను హెచ్చిరించింది కోర్టు..
ఇటు ప్రభుత్వంపై.. అటు అధికారులు తీరుపై పలుసార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మార్పు కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఈ సారి కేవలం హెచ్చరికలతో సరిపెట్టుకుండా.. నేరుగా శిక్షలు వేసింది. అయితే ఇవాళే ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది..
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై.. ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
దీంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈకేసుకు సంబంధించి హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది. అలాగే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.