Home /News /politics /

BIG SHOCK TO ANDHRA PRADESH CM JAGAN CBI COURT TO SEND TO NOTICE TO IN ED CASE TO CM JAGAN NGS

Shock to Jagan: సీఎం జగన్ కు మరో షాక్.. ఈడీ కేసుల్లో 22న కోర్టుకు రావాలంటూ నోటీసులు

సీఎం జగన్ కు షాక్ ల పై షాక్ లు

సీఎం జగన్ కు షాక్ ల పై షాక్ లు

ఈ నెల 22న ఈడీ కేసుల్లో కోర్టుకు రావాలి అంటూ సమన్లు.. మరోవైపు 25న సీఎం జగన్ బెయిల్ పై తుది తీర్పు వస్తుంది అంటూ ప్రచారం.. దీంతో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని టెన్షన్ పడుతున్నారు.

ఇంకా చదవండి ...
  సీఎం జగన్ కు వరుస షాక్ లు తప్పడం లేదు. ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. లేపాక్షి, వాన్‌పిక్‌ కేసుల్లో సెప్టెంబరు 22న హాజరు కావాలని జగన్‌తో పాటు ఇతర నిందితులను కోర్టు ఆదేశించింది. లేపాక్షి కేసులో వై.ఎస్‌.జగన్‌తో పాటు 24 మందికి సమన్లు జారీ అయ్యాయి. ఇందులో పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఐఏఎస్‌లు బి.పి.ఆచార్య, డి.మురళీధర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జగతి పబ్లికేషన్స్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఎండీ శ్రీనివాస బాలాజీ, బి.పి.కుమారబాబు, వాల్డన్‌ ప్రాపర్టీస్‌, కార్నర్‌స్టోన్‌ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, గిల్‌క్రిస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఆల్ఫా విల్లాస్‌, అల్ఫా ఎవెన్యూస్‌, ఆస్రా థీమ్‌ ప్రాజెక్ట్స్‌, లేపాక్షి ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌, లేపాక్షి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లేపాక్షి హెరిటేజ్‌ వెల్‌నెస్‌ విలేజ్‌, సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఆసరా లిమిటెడ్‌లకు సమన్లు జారీ అయ్యాయి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో అనంతపురం జిల్లా గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో 8,844 ఎకరాలను అప్పటి వై.ఎస్‌. ప్రభుత్వం ప్రభుత్వం నామమాత్రపు ధరకు కేటాయించిందని కేసు దాఖలైంది. ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన కంపెనీ 1,326 కోట్ల విలువైన భూమికి 119 కోట్లే చెల్లించిందని దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో 70 కోట్లను ఇందూ కంపెనీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ పేర్కొంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తులో పెట్టుబడుల మళ్లింపులో అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేల్చింది.

  దీంతో ఏపీలో ఏం జరుగుతోంది అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దుపై ఈ నెల 25న తుది తీర్పు వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న ఏం జరుగుతుందో చూద్దామని ఎంపీ రఘురామరాజు ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా ఈడీ కేసుల్లో ఈ నెల 22న కోర్టుకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ రెండు పరిణామాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి.

  వాన్‌పిక్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మొత్తం 21 మంది నిందితులకు సమన్లు జారీ అయ్యాయి. ఇందులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాశ్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ఎం.శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌లతో పాటు జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాన్‌పిక్‌ పోర్ట్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌, గిల్‌క్రిస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆల్ఫా విల్లాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆల్ఫా అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీటా అవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీ2 కార్పొరేట్‌ సర్వీసెస్‌, సుగుణి కన్‌సక్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు సమన్లు జారీ అయ్యాయి. వాన్‌పిక్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో పలు పత్రాలు లేకపోవడంతో కోర్టు తిరస్కరించగా ఇటీవల తిరిగి దాఖలు చేసింది. వీటన్నింటినీ పరిశీలించిన సీబీఐ కోర్టు అభియోగపత్రాన్ని విచారణకు పరిగణనలోకి తీసుకుని, నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో వైఎస్‌ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధికి ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లోకి 854 కోట్లు పెట్టుబడులు వెళ్లాయని ఈడీ పేర్కొంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు