టీఆర్ఎస్‌కు షాక్... గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

Telangana lok sabha election results 2019 | తెలంగాణలోని సగానికి పైగా స్థానాల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల్లో ఆధిక్యత సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

  • Share this:
    తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. మొదట్లో టీఆర్ఎస్ అనేక స్థానాల్లో ఆధిక్యత సాధించగా... పలు రౌండ్ల కౌంటింగ్ తరువాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. సగానికి పైగా స్థానాల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల్లో ఆధిక్యత సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న ప్రాంతాలుగా చెప్పుకునే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 15 వేల పైచిలుకు ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.

    ఇక కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధిక్యం 20 వేలు దాటింది. ఆదిలాబాద్‌లోనూ టీఆర్ఎస్‌పై బీజేపీ ఆధిక్యత దిశగా ముందుకు సాగుతోంది. ఇక నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, చేవేళ్ల స్థానాల్లో కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ కంటే ముందంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుండటంతో... ఈ స్థానాల్లో కొన్నింటిని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    First published: