బీజేపీకి షాక్... తెలంగాణలో అభ్యర్థులు కరువు...

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 2727 వార్డులకు నిన్న నామినేషన్ల గడువు ముగిసిపోగా... దాదాపు 30 శాతం స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: January 11, 2020, 6:15 PM IST
బీజేపీకి షాక్... తెలంగాణలో అభ్యర్థులు కరువు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని పదే పదే చెబుతున్న బీజేపీ నేతలు... ఆచరణలో మాత్రం విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 2727 వార్డులకు నిన్న నామినేషన్ల గడువు ముగిసిపోగా... దాదాపు 30 శాతం స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి... ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై ముందు నుంచే బీజేపీ కసరత్తు చేసినప్పటికీ... ఇలాంటి పరిస్థితి రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ బీజేపీ తరపున పలు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంపై ఆయన క్లస్టర్ ఇంఛార్జ్‌లను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి... మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలోనే ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: January 11, 2020, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading