టీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు... కాంగ్రెస్‌లో మిగిలేది ఆరుగురే ?

మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

news18-telugu
Updated: April 20, 2019, 5:29 PM IST
టీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు... కాంగ్రెస్‌లో మిగిలేది ఆరుగురే ?
తెలంగాణ సీఎం కేసీఆర్ (File)
  • Share this:
లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పదిమందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంకాగా... తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ జాబితాలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

జగ్గారెడ్డి, వీరయ్య, వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయం కావడంతో... ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం మిగలనున్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసే దిశగా వ్యూహరచన చేసిన టీఆర్ఎస్... తాజా చేరికలతో ఆపరేషన్ ఆకర్ష్‌ను దాదాపుగా పూర్తి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ మొదటివారంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో కలిపేయడం కూడా లాంఛనమే అని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఆ పార్టీని పూర్తిస్థాయిలో దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading