టీడీపీకి డబుల్ షాక్... వైసీపీలోకి మాజీమంత్రి ?

జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలవడం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: October 21, 2019, 1:03 PM IST
టీడీపీకి డబుల్ షాక్... వైసీపీలోకి మాజీమంత్రి ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
రాజకీయాల్లో నేతలు ఎప్పుడు ఎటు వైపు వెళతారో చెప్పడం కష్టం. ప్రస్తుతం ఏపీలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న టీడీపీ నేతల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇక సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలో టీడీపీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలకు కూడా అర్థంకావడం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎంపీ సీఎం రమేశ్ బీజేపీలో చేరగా... వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి సోమవారమే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండటంతో... ఆయన పార్టీ మారడాన్ని టీడీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలవడం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ పోర్ట్‌లో సీఎం జగన్‌ను కలిసిన రామసుబ్బారెడ్డి ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. దీంతో జమ్మలమడుగు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కూడా చంద్రబాబుకు షాక్ ఇస్తారా ? అనే చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తనను కాదని ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారనే అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డి... అదును చూసుకుని చంద్రబాబుకు, టీడీపీ హ్యాండ్ ఇవ్వనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి కడప జిల్లాలో వైసీపీ దెబ్బకు కుదేలైన టీడీపీకి రామసుబ్బారెడ్డి పార్టీ మారితే మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే చెప్పాలి.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading