BIG SHOCK FOR BJP IN TRIPURA TWO MLAS QUIT BJP JOIN CONGRESS PVN
Tripura : త్రిపురలో అనూహ్య రాజకీయ పరిణామాలు..బీజేపీ సర్కార్ కూలిపోనుందా!
త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా
Tripura BJP MLA's Resign : పురలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. అధికార బీజేపీకి సొంత ఎమ్మెల్యేలే బిగ్ షాక్ ఇస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ త్రిపుర అసెంబ్లీతోపాటు భారతీయ జనతా పార్టీకి
Tripura BJP MLA's : త్రిపురలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. అధికార బీజేపీకి సొంత ఎమ్మెల్యేలే బిగ్ షాక్ ఇస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ త్రిపుర అసెంబ్లీతోపాటు భారతీయ జనతా పార్టీకి సోమవారం రాజీనామా చేసిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయిన ఇరువురు హస్తం పార్టీలో చేరినట్లు తెలిపారు. దీంతో మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ బలం 33 కి పడిపోయింది.
రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్లో చేరిన అనంతరం సుదీప్ రాయ్ తెలిపారు. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో నిరీక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం మైనారిటీలో పడటం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీలోని ప్రతి ఒక్కరు భ్రమల్లో ఉన్నారన్న ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్తో పాటే త్రిపురలోనూ ఎన్నికలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పాలన అందించడంలో బీజేపీ విఫలమైందని ఆశిష్ కుమార్ సాహా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో త్రిపురలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని ఆరోపించారు. ఒకవేళ మరికొన్ని రాజకీయ వలసలు ఏర్పడితే త్రిపురలో బీజేపీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికనట్టు అయ్యింది. వీరద్దరూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో దీప్ రాయ్ బర్మన్ 15 నెలల పాటు త్రిపుర ఆరోగ్య మంత్రిగా కూడా పని చేశారు. తర్వాత మంత్రి మండలి నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి బీజేపీలోని అసమ్మతి శిబిరానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణ కూడా ఉంది. పార్టీలో అంతర్గత అసమ్మతిని తగ్గించడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రామ్ ప్రసాద్ పాల్, సుశాంత చౌదరి లను గతేడాది ఆగస్టులో మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అలాగే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యే ను మంత్రిని చేశారు. దీంతో పాటు రెబాటి మోహన్ దాస్ స్థానంలో రతన్ చక్రవర్తి ని అసెంబ్లీ స్పీకర్గా నియమించారు. అయితే బర్మన్ కు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ అతనిని సంప్రదించింది. కానీ ఆయన సీఎంను మార్చాలని పట్టుబట్టారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అశిష్ కుమార్ సహాకు కూడా మంత్రి పదవి ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తిరస్కరించినట్లు సమాచారం.
మరోవైపు,తాజా పరిణామాలపై త్రిపుర బీజేపీ చీఫ్ స్పందించారు. వారి రాజీనామాలతో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ మాణిక్ సాహ అన్నారు. అయితే 2018 లో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.