Andhra Pradesh: ఎస్ఈసీ నీలం సాహ్నికి ఊరట.. హైకోర్టులో పిల్ విత్ డ్రా ఎందుకో తెలుసా..?

నీలం సాహ్నికి నోటీసులు

ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి తొలిసారి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె నియామకాన్ని రద్దు చేయాలని వేసిన పిల్ ను పిటిషనర్ విత్ డ్రా చేసుకున్నాడు ఎందుకో తెలుసా..?

  • Share this:
    ఇటీవల వరుస షాక్ లు తింటున్న ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల ఓ పిల్‌ దాఖలైంది. అయితే ఆ పిల్ ను పిటిషనర్‌ విత్‌డ్రా చేసుకున్నారు. ఇదే విషయాన్ని అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్‌ వేశారని ప్రశ్నించింది. పిల్‌ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు తన పిల్‌ను ఉపసంహరించుకున్నారు.

    గతంలో ఇదే అంశానికి సంబంధించి ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ న్యాయం పోరాటం చేస్తున్నారు.

    ఇదీ చదవండి: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మాత్రమే కాదు.. ఐటీ హబ్ గా విశాఖ.. ఫోకస్ చేసిన సీఎం జగన్

    ప్రస్తుత పరిణామాల మధ్య ఎస్ఈసీ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్న రేంజ్ లో ఫైటింగ్ సాగింది. ఎన్నికల విషయంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీపై వేటు వేస్తే.. ఆయన న్యాయపోరాటం చేసి మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవిలోకి తిరిగి వచ్చిన తరువాత అనుకన్నట్టే ఎన్నికలు నిర్వహించడమే కాదు.. మంత్రులు బయటకు రాకుండా నిషేదం కూడా విధించే ప్రయత్నం చేశారు. ఇటు ఏపీ ప్రభుత్వం ప్రివిలేజ్ మోషన్ వరకు వ్యవహారం వెళ్లింది.  ఏదీ ఏమైనా ఆయన పదవీ కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం  ఊరట పొందింది. ఇప్పుడు ఏరి కోరి నీలం సాహ్నికి ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీగా అవకాశం ఇచ్చి.. గవర్నర్ తో ఆమోద ముద్ర వేయించుకుంది ప్రభుత్వం.. అప్పటి నుంచి కోర్టు తీర్పుల ద్వారా ఏదో ఒక తలనొప్పి తప్పడం లేదు. ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తరువాత కోర్టు నుంచి లభించిన తొలి ఊరట ఇది మాత్రమే..
    Published by:Nagesh Paina
    First published: