ఏపీకి మోదీ ప్రభుత్వం వేల కోట్ల వరం... జగన్‌కు బిగ్ రిలీఫ్...

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.48వేల కోట్లు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

news18-telugu
Updated: March 13, 2020, 10:24 PM IST
ఏపీకి మోదీ ప్రభుత్వం వేల కోట్ల వరం... జగన్‌కు బిగ్ రిలీఫ్...
మోదీని కలిసిన జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా భరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ మీద ఇన్నాళ్లూ క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన గుదిబండ పడేది. అయితే, భూసేకరణ, పునరావాసానికి కూడా నిధులు కేంద్రం భరించనుంది. పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.55,545 కోట్లుకు సవరించింది. అయితే, అందులో రూ.48వేల కోట్లు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.16,000 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా సవరించిన అంచనాలు, కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం మరో రూ.32వేల కోట్లు కూడా కేంద్రమే భరించనుంది. అందులో భూసేకరణ, పునరావాల పనులకు రూ.27వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరో రూ.5వేల కోట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్ కోసం ఖర్చు అవుతుంది. సవరించిన అంచనాల ప్రకారం రూ.55,545 కోట్లు ప్రాజెక్టు వ్యయం అయితే, అందులో రూ.48వేల కోట్లు కేంద్రం భరిస్తే, మిగిలిన రూ.7వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.

2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పనులు త్వరితగతిన సాగుతున్నా... నిర్వాసితులకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ విషయంపై మాత్రమే స్పష్టత లేదు. ఇప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం నిజంగా వరం అవుతుంది.
First published: March 13, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading