• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • BIG JOLT TO YS SHARMILA AS PRASHANTH KISHOR WANTS TO QUITS AS POLITICAL STRATAGIST BA

YS Sharmila: వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ .. ఇలాంటి షాక్ ఎవ్వరూ ఊహించరు..

ప్రశాంత్ కిశోర్, వైఎస్ షర్మిల (File)

ఎన్నికల వ్యూహకర్త బాధ్యతలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. తాను తప్పుకొంటున్నట్టు చెప్పారు. వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు అందిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ వార్త వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ముందే షాక్ లాంటిది.

  • Share this:
    తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న వైఎస్ షర్మిలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ షాక్ ఇచ్చారా? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి మూడోసారి మమతా బెనర్జీ జయకేతనం ఎగురవేశారు. అయితే, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఇండియా టుడే టీవీ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారని, దీనికి సంబంధించి గతంలోనే ఓసారి విజయవాడలో చర్చ జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకొంటున్నట్టు ప్రకటించడం మాత్రం వైఎస్ షర్మిలకు షాక్ అనే రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

    ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు పంజాబ్ ప్రభుత్వం కేబినెట్ హోదా కూడా కల్పించింది. అయితే, ఇప్పుడు ఆయన ఇలా సడన్‌గా ఎలక్షన్ స్ట్రాటజీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం సంచలనంగా మారింది.

    తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. పార్టీ పేరు, జెండా, ఎజెండాలను త్వరలో ప్రకటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెల్లెలు, వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఏపీలో వదిలేసి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి కారణాలను కూడా వివరించారు. తెలంగాణ ఏర్పడినా.. అందుకు తగ్గ ఆకాంక్షలు నెరవేరలేదని షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్‌కు కేసీఆర్‌కు పోలిక లేదని అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజలను కలవలేదని.. అసలు ఆయన సచివాలయానికే వెళ్లలేదని విమర్శించారు. వైఎస్ఆర్ ప్రతిరోజు కొన్ని వందల మందిని కలిసేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం దొరల కాళ్ల కింద నలిగిపోతోందని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. దొర చెప్పిందే వేదం అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరని షర్మిల అన్నారు. అందుకే తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని షర్మిల విమర్శించారు. ఆ పార్టీ టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే పార్టీగా మారిందని అన్నారు.

    పార్టీ ప్రకటిస్తానని చెప్పిన తర్వాత వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం ఏప్రిల్ 15 నుంచి మూడు రోజుల దీక్ష చేపట్టారు. ఇందిరాపార్క్‌లో ఒక రోజు దీక్ష చేసిన ఆమె తన ఇంటి వద్దే మరో రెండు రోజులు దీక్షను కొనసాగించారు. ఇందిరా పార్క్ నుంచి తన ఇంటికి ర్యాలీగా వస్తున్న తమపై పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా దుస్తులు చించేశారని ఆరోపించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: