• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIG BLOW FOR CHANDRABABU NAIDU AND TDP WITH BJP DECISION AK

చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ...

చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ...

చంద్రబాబు, అమిత్ షా, మోదీ

కేంద్రంలోని అధికార బీజేపీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఊహించని షాక్ ఇచ్చిందా ? అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న పోరాటం ఫలించే అవకాశం లేదని కేంద్రం పరోక్షంగా సంకేతం ఇచ్చిందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీ మూడు రాజధానుల అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రం... రాష్ట్ర రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని వివరించింది. దీంతో ఈ విషయంలో టీడీపీ ఏ రకంగా ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీకి చెందిన ముఖ్యనేతలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు.

    అయితే ఈ విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వంటివారు ప్రకటనలు చేశారు. అయితే తాజాగా పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వడంతో... ఈ విషయంలో బీజేపీ టీడీపీకి, ఆ పార్టీ అధినేతకు గట్టి షాక్ ఇచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీపరంగా బీజేపీ ఏపీ శాఖ అమరావతికి, ఆ ప్రాంత రైతులకు మద్దతుగా క్షేత్రస్థాయి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నా... కేంద్రం మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం... టీడీపీకి ఎదురుదెబ్బే అనే రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు