కాంగ్రెస్‌కు గండ్ర గుడ్‌బై..కేటీఆర్‌తో భేటీ..త్వరలో టీఆర్ఎస్‌లోకి..

ఆయన భార్య గండ్ర జ్యోతి సైతం డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే వీరిద్దరు గులాబీ దళంలో చేరనున్నారు.

news18-telugu
Updated: April 22, 2019, 11:04 PM IST
కాంగ్రెస్‌కు గండ్ర గుడ్‌బై..కేటీఆర్‌తో భేటీ..త్వరలో టీఆర్ఎస్‌లోకి..
కేటీఆర్‌ను కలిసిన గండ్ర దంపతులు
  • Share this:
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినా తెలంగాణలో నేతల వలసలు ఆగడం లేదు. అధికార పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గండ్ర దంపతులు సమావేశమయ్యారు. ఆయన భార్య గండ్ర జ్యోతి సైతం డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే వీరిద్దరు గులాబీ దళంలో చేరనున్నారు.

నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నా. రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరతాను. కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధం.
గండ్ర వెంకటరమణారెడ్డి
వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే ఆయన భార్య జ్యోతికి జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గండ్ర దంపతులు గులాబీ గూటిలో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.

గండ్ర వెంకటరమణ లేఖ


గండ్ర జ్యోతి లేఖ
First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు