టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే...రెండు రోజుల్లో చేరిక

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండురోజుల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: April 22, 2019, 8:09 AM IST
టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే...రెండు రోజుల్లో చేరిక
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులు ఆగడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి రోజురోజుకు వలసలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు... టీడీపీకి చెందిన పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కమలం గూటికి చేరారు. ఇప్పుడు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండురోజుల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గండ్రతో పాటు ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి లేఖ ఇస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన గండ్ర, పోదెం వీరయ్య,జగ్గారెడ్డి పార్టీని వేడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు శనివారం ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారాన్ని టీపీసీసీ నేతలు మాత్రం తోసిపుచ్చుతున్నారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి గండ్ర మాత్రం హాజరుకాలేదు. ఆ తర్వాత భట్టి విక్రమార్క ఆదివారం గండ్రను తననివాసానికి పిలిపించి పార్టీ మారొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే గండ్ర మాత్రం టీఆర్ఎస్‌లో చేరేందుకే సిద్ధమైపోయినట్లు ఆయన అనుచరులు, సన్నిహితులు చెబుతున్నారు.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు