HOME »NEWS »POLITICS »bhuma akhila priya bail petition in kidnap case rejected by secunderabad court hsn

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మరో షాక్.. సికింద్రాబాద్ కోర్టు కీలక నిర్ణయం

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మరో షాక్.. సికింద్రాబాద్ కోర్టు కీలక నిర్ణయం
భూమా అఖిలప్రియ (ఫైల్ ఫోటో)

కిడ్నాప్ కేసులో తన అరెస్ట్‌పై భూమా అఖిల ప్రియ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. పిటీషనర్ గర్భిణి అనీ, రాజకీయంగా కక్ష సాధింపుల నిమిత్తమే ఆమెను అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు.

  • Share this:
    హైదరాబాద్‌లో కలకలం రేపిన  కిడ్నాప్ వ్యవహారం కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అఖిల ప్రియ అరెస్ట్ జరిగిందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ సోదరి అరెస్ట్ వెనుక భూవివాదమే కాకుండా, ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనీ వారు తేల్చిచెబుతున్నారు. అయితే తన అరెస్ట్ పై భూమా అఖిల ప్రియ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. పిటీషనర్ గర్భిణి అనీ, రాజకీయంగా కక్ష సాధింపుల నిమిత్తమే ఆమెను అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామనీ, విదేశాలకు వెళ్లమని కూడా తెలిపారు. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరపు న్యాయవాది బలంగా వాదించారు.

    అఖిల ప్రియ రాజకీయ నాయకురాలనీ, సాక్ష్యాలను ప్రభావితం చేసే శక్తి ఆమెకు ఉందని న్యాయమూర్తికి విన్నవించారు. కిడ్నాప్ కేసు విచారణ కీలక దశలో ఉందనీ, ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇస్తే విచారణ వేగం తగ్గిపోతుందని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేశారు. ఆమెను జనవరి 13 వరకు కస్టడీలోకి తీసుకోవచ్చని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణ సమయంలో ఆమె తరపు న్యాయవాది ఆమెతో మాట్లాడవచ్చునని స్పష్టం చేశారు. భూమా అఖిలప్రియకు కావాల్సిన వైద్య సహాయంలో కూడా అలక్ష్యం చేయొద్దని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా, భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



    కాగా, బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంగళవారం రాత్రి 7.20 గంటలకు పది నుంచి 15 మంది వరకు దుండగులు, బోయిన్ పల్లిలోని ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్‌రావుల ఇంట్లోకి దూరి, వారిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూ లావాదేవీల వ్యవహారంలో వీరి కిడ్నాప్ జరిగింది. ఇతర కుటుంబ సభ్యులను వేరే గదిలో బంధించి, వీరిని కిడ్నాప్ చేసి, కార్లలో తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై 100 కు డయల్ చేశారు. పోలీసులు 15 బృందాలుగా ఏర్పడి మొత్తానికి అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో వారిని గుర్తించారు. భూమా అఖిలప్రియే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి అని బాధితులు అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు ఆ దిశగా విచారణ చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆమెను ఏ2గా చార్జిషీటులో నమోదు చేసిన పోలీసులు, కేసులో ఆమె పాత్ర గురించి మరిన్ని నిజాలు తేలడంతో ఆమెను ఏ1గా మార్చారు. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా నమోదు చేశారు. భూమా అఖిల ప్రియ భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 11, 2021, 12:05 IST

    टॉप स्टोरीज