మీ సలహాలు అక్కర్లేదు.. రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్

ఉత్తమ్‌పై తీవ్ర విమర్శలు చేసే కోమటిరెడ్డి.. ఉపఎన్నిక విషయంలో ఆయన్ను వెనకేసుకు రావడం చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: September 19, 2019, 7:03 PM IST
మీ సలహాలు అక్కర్లేదు.. రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్
కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి
  • Share this:
హుజూర్‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. రోజురోజుకీ అవి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి పేరును ప్రకటించడాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. పద్మావతికి బదులు శ్యామల కిరణ్ రెడ్డిని నిలబెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో పార్టీలో రచ్చ మొదలైంది. కొందరు ఉత్తమ్‌కు మద్దతివ్వగా.. మరికొందరు రేవంత్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలో తమకు తెలుసని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ రాజకీయాల విషయంలో పక్క జిల్లా నేతల సలహాలు తమకు అవసరం లేదని స్పష్టంచేశారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని చెప్పుకొచ్చారు. జిల్లాలో 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని.. తమని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా.? అన్ని ప్రశ్నించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తానూ ఒక్కటయ్యామని.. గతంలో కొంత అభిప్రాయ భేదాలున్నా, వాటిని పక్కనబెట్టామని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఐతే ఉత్తమ్‌పై తీవ్ర విమర్శలు చేసే కోమటిరెడ్డి.. ఉపఎన్నిక విషయంలో ఆయన్ను వెనకేసుకు రావడం చర్చనీయాంశమైంది.

కాగా, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉపఎన్నికపై మాట్లాడారు. హుజూర్ నగర్ అభ్యర్థిగా శ్యామల కిరణ్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాకు ఫిర్యాదు చేశారు. అభ్యర్థి విషయంలో ఉత్తమ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని తప్పుబట్టారు. దాంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2019, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading