హైదరాబాద్‌లో షర్మిల ఫిర్యాదు..ఏపీలో రాజకీయ ’భోగి‘ మంటలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న వైఎస్ షర్మిల.. మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఏపీ రాజకీయాల చూపును తనవైపు తిప్పుకొన్నారు.

news18-telugu
Updated: January 14, 2019, 9:11 PM IST
హైదరాబాద్‌లో షర్మిల ఫిర్యాదు..ఏపీలో రాజకీయ ’భోగి‘ మంటలు
షర్మిల, చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: January 14, 2019, 9:11 PM IST
’ప్రత్యర్థులపైకి జగనన్న వదిలిన బాణాన్ని నేను‘ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్‌చల్ చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్ర విభజన తర్వాత సైలెంటైపోయారు. తన సోదరుడు వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నన్ని రోజులూ.. పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనే గడిపిన షర్మిల.. అనంతరం రాజకీయాలకు దూరంగా జరిగిపోయారు. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని భావించినా.. అది కూడా జరగలేదు. నాలుగున్నరేళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న షర్మిల.. ఇప్పుడు మరోసారి పొలిటికల్ లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. తెలుగు రాష్ట్రాల చూపును తనవైపు తిప్పేసుకున్నారు.

ys sharmila, ys sharmila news, sharmila prabhas, sharmila reddy, y s sharmila, prabhas sharmila, sharmila prabhas photos, ys sharmila husband, prabhas and sharmila, ap politics, ap cm nara chandrababu naidu, షర్మిల ప్రభాస్, షర్మిల ఫోటోలు, షర్మిల భర్త, షర్మిల వయస్సు, ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల న్యూస్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ
వైఎస్ షర్మిల

తనకు, సినిమా హీరో ప్రభాస్‌కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. షర్మిల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందంటూ షర్మిల చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ys sharmila, ys sharmila news, sharmila prabhas, sharmila reddy, y s sharmila, prabhas sharmila, sharmila prabhas photos, ys sharmila husband, prabhas and sharmila, ap politics, ap cm nara chandrababu naidu, షర్మిల ప్రభాస్, షర్మిల ఫోటోలు, షర్మిల భర్త, షర్మిల వయస్సు, ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల న్యూస్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ
హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిల
ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ’భోగి‘ మంటలు రాజేసింది. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీల మధ్య రగులుగుతున్న అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. తమ పార్టీపై షర్మిల చేసిన ఆరోపణలు తీవ్రంగా తప్పుబడుతున్నారు టీడీపీ నేతలు. ఒక్కొక్కరుగా ఆమె ఆరోపణలు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుండడంతో.. రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. మహిళలను గౌరవించే పార్టీ టీడీపీ మాత్రమేనని, మహిళా సంరక్షణ గురించి చంద్రబాబుకు ఇతరులు చెప్పాల్సిన పనిలేదని ఏపీ మంత్రి జవహర్ స్పష్టం చేశారు. షర్మిల ఆరోపణలు చూస్తుంటే విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తాము జగన్ విమర్శించామే తప్ప, షర్మిళ ప్రస్తావన ఎప్పుడూ తీసుకు రాలేదని.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. షర్మిళపై సోషల్ మీడియాలో ఎవరో అసభ్యకరమైన పోస్టులు పెడితే.. దాన్ని టీడీపీకి ఆపాదించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ys sharmila, ys sharmila news, sharmila prabhas, sharmila reddy, y s sharmila, prabhas sharmila, sharmila prabhas photos, ys sharmila husband, prabhas and sharmila, ap politics, ap cm nara chandrababu naidu, షర్మిల ప్రభాస్, షర్మిల ఫోటోలు, షర్మిల భర్త, షర్మిల వయస్సు, ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల న్యూస్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ
వైఎస్ జగన్‌తో షర్మిల

ఇక, షర్మిళ ఎపిసోడ్‌ను వైసీపీ చేస్తున్న రాజకీయడ్రామాగా అభివర్ణిస్తోంది టీడీపీ. ఎన్నికల వేళ ఇలాంటి ఆరోపణలు చేయించడం ద్వారా అధికార పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు కుట్ర చేస్తోందని విమర్శిస్తోంది. అందుకే దాన్ని తిప్పికొట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందుకోసం ’షర్మిల హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడం‘ అనే అంశాన్నే ఆయుధంగా మలచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Loading...
ys sharmila, ys sharmila news, sharmila prabhas, sharmila reddy, y s sharmila, prabhas sharmila, sharmila prabhas photos, ys sharmila husband, prabhas and sharmila, ap politics, ap cm nara chandrababu naidu, షర్మిల ప్రభాస్, షర్మిల ఫోటోలు, షర్మిల భర్త, షర్మిల వయస్సు, ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల న్యూస్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ
వైఎస్ జగన్‌తో షర్మిల ఫైల్

ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించడం, రాష్ట్ర పోలీసు వ్యవస్థను కించపరచడమేనని.. అలాంటి వారికి ఏపీలో ఓట్లు అడిగే అర్హతెక్కడిదని టీడీపీ ప్రశ్నిస్తోంది. సొంత రాష్ట్రంలో పోలీసులను నమ్మలేని వాళ్లు.. ఇక్కడి ప్రజలను ఓట్లెలా అడుగుతారంటూ.. ఇకమీదట కూడా నిలదీయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా మార్చుకున్నందున.. తాము కూడా రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. షర్మిల హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ఒక ఆయుధంగా మలచుకొని, ప్రతివిమర్శలు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.

ys sharmila, ys sharmila news, sharmila prabhas, sharmila reddy, y s sharmila, prabhas sharmila, sharmila prabhas photos, ys sharmila husband, prabhas and sharmila, ap politics, ap cm nara chandrababu naidu, షర్మిల ప్రభాస్, షర్మిల ఫోటోలు, షర్మిల భర్త, షర్మిల వయస్సు, ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల న్యూస్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ
వైఎస్ షర్మిల, చంద్రబాబు ఫైల్

మొత్తానికి హైదరాబాద్‌లో షర్మిల ఇచ్చిన ఫిర్యాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ’భోగి‘ మంటలు రేపుతోందనే టాక్ రాజకీయవర్గాల్లో వినబడుతోంది. అయితే, నిజంగా ఇది వైసీపీ వేసిన రాజకీయ ఎత్తుగడే అయితే అది సఫలీకృతమవుతుందా? వైసీపీ వేసిన ఈ ఎత్తుగడను టీడీపీ ఎదుర్కొంటుందా? ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగబోతోందనే ఆసక్తి మాత్రం రెట్టిపయ్యింది.
First published: January 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...