Chandrashekhar Azaad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కాల్పులు.. ధ్రువీకరించని పోలీసులు

తన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారని భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం తెలిపారు.

news18-telugu
Updated: October 26, 2020, 7:36 AM IST
Chandrashekhar Azaad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై కాల్పులు.. ధ్రువీకరించని పోలీసులు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(ఫైల్ ఫొటో)
  • Share this:
తన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారని భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షహర్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. "బులాంద్‌షహర్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో నిలపడంతో ప్రత్యర్థి పార్టీలు భయపడిపోతున్నాయని విమర్శించారు. బులాంద్‌షహర్ ఎన్నికల ర్యాలీ వాళ్లకు నిద్ర లేకుండా చేసిందని.. అందుకే తన కాన్వాయ్‌పై పిరికి వాళ్లలాగా కాల్పులు జరిపారని తెలిపారు. ఇది వారి ఓటమి నిరాశను చూపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టాలని వాళ్లు చూస్తున్నారని.. కానీ తాను అది జరగనివ్వను"అని చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనపై స్పందించిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సంతోష్ కుమార్ సింగ్ ఈ ఘటనను ధ్రువీకరించలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని ఆయన చెప్పారు. ఇక, తాము ఆజాద్ సమాజ్ పార్టీ పేరిట రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా చంద్రశేఖర్ ఆజాద్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు భీమ్ ఆర్మీ దీనిని అనుబంధంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఆజాద్ సమాజ్ పార్టీ(ఏ‌ఎస్‌పీ) తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని బలాంద్‌షహర్ శాసనసభ నియోజవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ‌ఎస్‌పీ తరఫున హాజీ యామిన్ బరిలో నిలిచారు.

బులాంద్‌షహర్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత వీరేంద్ర సిరోహి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానంతో పాటు మొత్తం ఏడు స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో తమ అభ్యర్థి తరఫున ఏఎస్‌పీ కార్యకర్తలు భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డోర్ టూ డోర్ క్యాంపైన్ చేపడుతూ మద్దతు కూడగడుతున్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading