హోమ్ /వార్తలు /National రాజకీయం /

Uttar Pradesh: యూపీలో బీజేపీ దూకుడు.. నిషాద్ పార్టీ​తో కమలం పొత్తు.. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలు

Uttar Pradesh: యూపీలో బీజేపీ దూకుడు.. నిషాద్ పార్టీ​తో కమలం పొత్తు.. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలు

యూపీ బీజేపీ చీఫ్​ స్వతంత్ర దేవ్​ Photo (ANI: Twitter)

యూపీ బీజేపీ చీఫ్​ స్వతంత్ర దేవ్​ Photo (ANI: Twitter)

యోగీ ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులే అస్త్రాలుగా ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో యూపీలో ప్రియాంకా గాంధీ ఎక్కువ పర్యటనలు చేస్తుండటంతో బీజేపీ శ్రేణులూ అలర్ట్​ అయ్యాయి. ఎన్నికల రంగంలో అడుగుపెట్టింది కమలం పార్టీ. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Elections 2022) కోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...

  వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్​ ఎన్నికలకు (Uttar Pradesh Elections 2022) అధికార బీజేపీ (BJP) సమాయత్తం అవుతోంది. యోగీ ఆదిత్యానాథ్ (Yogi adityanath0​ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులే అస్త్రాలుగా ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో యూపీలో ప్రియాంకా గాంధీ ఎక్కువ పర్యటనలు చేస్తుండటంతో బీజేపీ శ్రేణులూ అలర్ట్​ అయ్యాయి. ఎన్నికల రంగంలో అడుగుపెట్టింది కమలం పార్టీ. 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Elections 2022) కోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది. ఇదే కోవలో నిర్బల్ ఇండియన్​ షోషిత్​ హమారా ఆమ్​ దళ్​ (Nirbal Indian Shosheet Hamara Aam Dal) తో పొత్తు పెట్టుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది.

  నిషాద్ నేతృత్వంలోని పార్టీ..

  రాష్ట్ర ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ) ఫిషింగ్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ నిషాద్ నేతృత్వంలోనిది ఈ నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ (Nishad). ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ శుక్రవారం ఈ విషయం మీడియాకు వెల్లడించారు. కమలం వికసించడానికి మా సంజయ్​ నిషాద్​, బీజేపీ నాయకులు కలిసి నడుస్తారని అన్నారు.

  సీట్లపై రాని స్పష్టత..

  సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ 2018 లోక్​సభ ఉప ఎన్నికలో గోరఖ్ పూర్ నుంచి బహుజన్ సమాజ్ వాదీ, సమాజ్​వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధించారు. సంత్ కబీర్ నగర్ నుంచి ప్రవీణ్ నిషాద్ లోక్ సభకు తిరిగి ఎన్నికైనప్పుడు 2019 ఎన్నికలలో నిషాద్ (Nishad) బీజేపీతో జతకట్టింది. బీజేపీ ఇంతకు ముందు మరో ఓబీసీ పార్టీ అప్నా దళ్ తో జతకట్టింది. కాగా, రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో విలేకరులు ప్రశ్నించగా బీజేపీ నాయకులు సమాధానం ఇవ్వలేదు. దీంతో నిషాద్​ కూడా మౌనంగానే ఉన్నారు.

  ఈ ఏడాది బీజేపీలో చేరడానికి కాంగ్రెస్ నుంచి వైదొలగిన జితిన్ ప్రసాద, బేబీ రాణి మౌర్యలతో పాటు సంజయ్ నిషాద్ ను శాసన మండలి సభ్యులు (ఎంఎల్​సీ)గా అవకాశం ఇవ్వవచ్చని బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. మౌర్య తన ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందు ఉత్తరాఖండ్ గవర్నర్ పదవి నుంచి ఈ నెలలోనే వైదొలిగారు.

  ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు 2022లో (Uttar Pradesh Elections 2022) జరగనున్నాయి. వివిధ పార్టీల మధ్య అప్పుడే పొత్తు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) తో సమాజ్‌వాది పార్టీ జతకట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని గతంలో చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత వైఖరిలో మార్పు రావడమే దీనికి కారణం. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో..ఆప్‌కు చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌తో భేటీ దీనికి కారణంగా తెలుస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్టు భేటీ అనంతరం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించినా..అసలు సంగతి మాత్రం పొత్తు రాజకీయాలపైనేననేది సమాచారం.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Politics, Uttar pradesh, Yogi adityanath

  ఉత్తమ కథలు