YCP vs BJP: ఏపీ పాలిటిక్స్ పై కమలనాథుల కొత్త వ్యూహం.. ఇక వైసీపీ- బీజేపీ సమరమేనా...?

ప్రతీకాత్మక చిత్రం

BJP vs YCP: ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలోపేతమయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

  • Share this:
స్వస్తిక దాస్, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలోపేతమయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్న కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీ బలం అంతంత మాత్రమే. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. అయితే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో కాషాయ పార్టీ పొత్తు పెట్టుకుంది. కాగా 2019 ఎన్నికల్లో అద్భుత మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)తో కొంతకాలం బీజేపీ సఖ్యతగా ఉందన్న వాదనలు వినిపించాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోదీ, అమిత్ షా సహా కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను వరుసగా కలిసిన నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరింది.

అయితే తాజాగా పరిణామాలు మారిపోయాయి. ఇరు పార్టీల నేతల మాటలు వింటుంటే ఇక వైసీపీ, బీజేపీ మధ్య సయోధ్య కాదు సమరమే అన్నట్టు అర్థమవుతుంది. తమ పార్టీల సిద్ధాంతాలు భిన్నమైనవని, కలిసే అవకాశం లేవని ఇటీవల బీజేపీ నేతలు చెబుతుండడంతో ఇరు పార్టీల మధ్య సఖ్యత ఉండే అవకాశం లేదనిపిస్తోంది.

ఇది చదవండి: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల... ఇలా అప్లై చేసుకోండి…


కేంద్ర క్యాబినెట్లోకి వైసీపీని తీసుకొని, ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తారన్న వాదనలను బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌ధర్ ఖండించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో తమకు పొత్తు ఉండదని న్యూస్ 18తో మాట్లాడుతూ చెప్పారు. “జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. జూలై 7 క్యాబినెట్ విస్తరణ ముందు ఆ పార్టీని బీజేపీ సంప్రదించలేదు. వైఎస్ఆర్సీపీ మా సిద్ధాంతాలకు భిన్నమైనది. జగన్ పాలనలో హిందువులు ఇబ్బందులు పడుతున్నారు. మత మార్పిడులకు ఆయన ఊతమిస్తున్నట్టుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణాలకు సహకరిస్తున్నారు” అని సునీల్ దేవ్‌ధర్ అన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం విపరీతమైన అప్పులతో రాష్ట్రాన్ని నడుపుతోందని, దీంతో భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని అన్నారు.

ఇది చదవండి: కీలక పథకంపై ప్రజల్లో అసంతృప్తి... వైసీపీ ఎమ్మెల్యేల వ్యతిరేకత.. సీఎం జగన్ ఎదుట కొత్త డిమాండ్లుఆంధ్రప్రదేశ్లో శక్తిమేర పోరాడతామని దేవ్‌ధర్ చెప్పారు. బీజేపీ మిషన్ సౌత్ ప్రణాళికల గురించి చెప్పారు. “మా నిర్ణయం స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్నేహం చేసేది జనసేనతోనే. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో పుంజుకుంటామని చాలా విశ్వాసంతో ఉన్నాం” అని దేవ్‌ధర్ చెప్పారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలున్నాయన్న వాదనలను వైసీపీ సైతం ఖండిస్తోంది. అయితే మోదీ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ ఆఫర్ ఇచ్చిందా.. లేదా అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

ఇది చదవండి: అర్ధరాత్రి రోడ్డు పక్కన అమ్మాయిలు చేసిన ఆ పనికి అంతా షాక్... సీసీ ఫుటేజ్ వైరల్...2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 గెలిచి తిరుగులేని మెజార్టీతో ఏపీలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. అలాగే 22 ఎంపీ సీట్లను గెలిచి సత్తాచాటింది. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసేందుకు సిద్ధమని వైసీపీ చెబుతుంది. అది సాధ్యం కాకుండా ఎన్డీఏలో చేరే అవకాశం లేదని వైసీపీకి చెందిన ఓ ఎంపీ చెప్పారు. అలాగే బీజేపీతో కలిస్తే తమకు అండగా ఉన్న వెనుకబడిన వర్గాల వారు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో యుద్ధం చేయకుండా.. అలాగే మరీ ఎక్కువ దూరం పాటించకుండా తటస్థంగా ఉండాలని వైసీపీ భావిస్తోందని సమాచారం.
Published by:Purna Chandra
First published: