• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BHARATHIYA JANATHA PARTY LEADERS DISTRIBUTING MONEY FOR VOTERS DURING PANCHAYAT ELECTIONS IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH PRN

AP Panchayat Elections: అర్ధరాత్రి ఇంటి ముందు డబ్బులు ప్రత్యక్షం.. అసలు విషయం తెలిసి అవాక్కైన జనం

AP Panchayat Elections: అర్ధరాత్రి ఇంటి ముందు డబ్బులు ప్రత్యక్షం.. అసలు విషయం తెలిసి అవాక్కైన జనం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) అభ్యర్థులు ఓటర్లపై కాసుల వర్షం కురిపిస్తున్నారు. గెలుపుపై ఆశతో ఒక్కో ఓటుపై వేలకువేలు పంచిపెడుతున్నారు

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు గాలం వేసేందుకు పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే వందలాది గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కాగా.. వీటిలో కొన్ని వేలంపాటల ద్వారా ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో అభ్యర్థులు ఓటర్లపై కాసుల వర్షం కురిపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచడం కలకలం రేపింది. కావలి రూరల్ మండలం, లక్ష్మీపురం గ్రామ పంచాయతీలోని గిరిజన కాలనీల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీలో 25 గిరిజన కుటుంబాలుండగా ఒక్కో కుటుంబానికి రూ.వేలచొప్పున పంపిణీ చేయినట్లు సమాచారం. స్థానికులు డబ్బులు తీసుకునేందుకు నిరాకరించగా ఇళ్లబయట మంచాలపై పెట్టి వెళ్లిపోయారు.

    ఇలా మొత్తం లక్షా 24వేల రూపాయలు ఓటర్లకు పంచగా.. స్థానికులు ఆ నగదును వీఆర్వో సాయంతో పోలీసులకు అప్పగించారు. కావలి మండలంలోని లక్ష్మీపురం గ్రామం నెల్లూరు-ప్రకాశం జిల్లాలకు సరిహద్దులో ఉంది. నెల్లూరు పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ స్వగ్రామం ఇదే. స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు భరత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్థానిక బీజేపీ నేతలు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మీనారాయణ నగదు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. గిరిజనులు డబ్బులు తీసుకునేందుకు నిరాకరించడంతో చాలకపోతే ఓటుకు రూ.10వేలిస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఐతే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల పరిధిలో 63 గ్రామ పంచాయతీలు ఉండగా 386 మంది అభ్యర్థులు సర్పంచ్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 636 వార్డులకు 1,617 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

    ఇది చదవంది: షటిల్ కోర్టులో షాకింగ్ ఘటన... కత్తులతో ఎంట్రీ ఇచ్చిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..


    ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఓ గ్రామపంచాయతీకి స్థానికులు వేలం నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పదవికి తొలుత ఆరుగురు పోటీలో నిలిచారు. ఐతే తనకు సర్పంచ్ పదవి ఇస్తే 29లక్షల రూపాయలిస్తానని ఓ అభ్యర్థి గ్రామ పెద్దలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు మాత్రం రూ.50 లక్షలు ఇస్తే ఓకే అని పరిశీలిస్తామన్నారు. దీంతో ఆ అభ్యర్థి దానికి అంగీకరించాడు. ఈ విషయంలో తెలుసుకున్న మరో వ్యక్తి తాను రూ.50.25 లక్షలు ఇస్తానని మందుకొచ్చాడు. చివరకు మొదటగా ముందుకొచ్చిన అభ్యర్థి రూ.50.50లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. పాట పాడిన వెంటనే డబ్బులు కూడా చెల్లించడంతో మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నిధులను గ్రామమాభివృద్ధి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానించారు.
    Published by:Purna Chandra
    First published: