ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బెంగాల్‌లో బీజేపీకి ప్లస్ అవుతుందా?

ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారంతో బెంగాలీల్లో బీజేపీకి ఎంతమేరకు వర్కవుట్ అవుతుంది? ఈ ప్రభావం ఎన్నికల మీద ఉంటుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: January 25, 2019, 9:34 PM IST
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బెంగాల్‌లో బీజేపీకి ప్లస్ అవుతుందా?
నరేంద్ర మోదీ, ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఆయనతో పాటు ప్రముఖ కవి భూపేన్ హజారికా, మాజీ ఎంపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత అయిన నానాజీ దేశ్‌ముఖ్‌లను కూడా భారతరత్న పురస్కారంతో గౌరవించింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేతకు ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వడం పెను సంచలనాన్ని సృష్టించింది.

Bharat Ratna, president pranab mukherjee, nanaji deshmukh, bhupen hazarika, ప్రణబ్ ముఖర్జీ, భారత రత్న, నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికా
ప్రణబ్ ముఖర్జీ


ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడ పట్టు సాధించేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ గతంలో కామ్రేడ్లు, తృణమూల్ కాంగ్రెస్ మధ్య యుద్ధం ఉండేది. ఇప్పుడు కామ్రేడ్ల ప్లేస్‌లోకి బీజేపీ వచ్చింది. అధికార టీఎంసీతో ఢీ అంటే ఢీ అంటోంది. బెంగాలీలను ఆకట్టుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మమతా బెనర్జీ
ఇటీవల వస్తున్న ఎన్నికల సర్వేల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొట్టడం బీజేపీకి కష్టమేనని వెల్లడి అవుతోంది. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారంతో బెంగాలీల్లో బీజేపీకి మంచిపేరు రావడానికి అవకాశం ఉందా? అని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభావం ఎన్నికల మీద ఉంటుందా? వచ్చే ఎన్నికల్లో బెంగాలీలు బీజేపీని మరింత దగ్గర చేసుకోవడానికి ఇది సోపానంగా ఉపయోగపడుతుందా? అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా


బీజేపీకి బెంగాల్లో గెలవడం అత్యవసరంగా భావిస్తోంది. బీజేపీని ఎదుర్కొనే పక్షాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ముందు వరుసలో ఉంటోంది. తాజాగా కోల్‌కతాలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీ ఏర్పాటు చేయడానికి కూడా కారణం అదే. మమతా బెనర్జీని ఆమె సొంత రాష్ట్రంలో రాజకీయంగా దెబ్బకొట్టగలిగితే ఆ ప్రభావం జాతీయస్థాయిలో ఉంటుందని బీజేపీ భావన. అందుకే పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ బాగా ఫోకస్ పెట్టింది.
First published: January 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>