వీర్ సావర్కర్‌కు భారత రత్న? బీజేపీపై కాంగ్రెస్, ఎంఐఎం ఆగ్రహం

2000లో వాజ్‌పేయి ప్రభుత్వం సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. ఐతే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.

news18-telugu
Updated: October 15, 2019, 8:19 PM IST
వీర్ సావర్కర్‌కు భారత రత్న? బీజేపీపై కాంగ్రెస్, ఎంఐఎం ఆగ్రహం
వీర్ సావర్కర్
  • Share this:
మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఓ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. తాము అధికారంలోకి వస్తే వీర్ సావర్కర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' అవార్డు వచ్చే కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు జ్యోతిబా పూలే, సావిత్రభాయ్ పూలేకు భారత రత్న సాధించడమే లక్ష్యమని తెలిపింది. ఇక బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామైతే ఏకంగా సావర్కర్‌కు అవార్డు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో బీజేపీ నేత మేజర్ సురేంద్ర పునియా సైతం సావర్కర్‌కు భారతరత్న అవార్డు రాబోతోందని ట్వీట్ చేశారు.
బీజేపీ తీరుపై కాంగ్రెస్, ఎంఐఎం సహా పలు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. గాంధీజీ హత్య కేసులో సావర్కర్ అరెస్టయ్యారని.. సావార్కర్ ప్రమేయంపై జీవన్‌లాల్ కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసిందని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం బీజేపీపై మండిపడ్డారు. కాగా, 1949లో గాంధీ హత్యలో కేసులో వీర్ సావర్కర్‌ను అరెస్ట్ చేశారు. ఐతే తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. ఇక 2000లో వాజ్‌పేయి ప్రభుత్వం సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. ఐతే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...