ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం... తృటిలో తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే

తాత్కాలిక డ్రైవర్ల కారణంగా పలు చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన నుంచి మాజీ ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 12:43 PM IST
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం... తృటిలో తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో తాత్కాలిక కార్మికులతో అరకొరగా బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక కండక్టర్ల కారణంగా పలు చోట్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. ఇక అంతగా అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్ల కారణంగా పలు ప్రాంతాల్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. టీఎస్‌ ఆర్టీసీ బస్సును నడుపుతున్న ఓ తాత్కాలిక డ్రైవర్‌, అతి వేగంతో దూసుకు రాగా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌ పురం సమీపంలో జరిగింది. స్థానిక సీపీఎం నేత బప్పెన కిరణ్‌ తో కలిసి సున్నం రాజయ్య బైక్‌ పై వస్తూ, శబరి నదిపై నిర్మించిన వంతెన పైకి చేరుకున్న వేళ, ఎదురుగా అత్యంత వేగంగా బస్సు దూసుకొచ్చింది. అది తనపైకే వస్తుందని భావించిన కిరణ్‌, వెంటనే బైక్‌ కు బ్రేక్‌ వేసి, రాజయ్యను రోడ్డు కిందకు పంపాడు. దీంతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం వీఆర్‌ పురంలో బస్సును ఆపిన స్థానికులు డ్రైవర్‌ను మందలించారు. రంగంలోకి దిగిన పోలీసులు... మరోసారి ఇలా జరుగకుండా చూసుకోవాలని డ్రైవర్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...