హోమ్ /వార్తలు /National రాజకీయం /

Bhabanipur Bypoll Result: సీఎం పీఠం పదిలం.. భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘన విజయం..

Bhabanipur Bypoll Result: సీఎం పీఠం పదిలం.. భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘన విజయం..

మమత బెనర్జీ

మమత బెనర్జీ

Mamata Banerjee: ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. 6 నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఉపఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి..విజయం సాధించారు.

ఇంకా చదవండి ...

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ సత్తా చాటింది. భవానీపూర్ (Bhabanipur) నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,832 గెలుపొందారు. సీఎం మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమె సీఎం పదవిలో కొనసాగనున్నారు.

Badvel By Election: బద్వేలులో పోటీకి బీజేపీ సై..? పవన్ సపోర్ట్ చేస్తారా..?

ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఉపఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు మమత. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సోవన్ దేబ్ ఛటర్జీ విజయం సాధించారు.  ఐతే మమత బెనర్జీ కోసం ఆయన రాజీనామా చేశారు. సెప్టెంబరు 30న పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్‌తో పాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ (Jangipur), సంషేర్ గంజ్ (Samserganj) స్థానాలకు పోలింగ్ జరిగింది. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal), సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ (Srijib Bishwas) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు.

బిహార్​లో ఎల్​జేపీకి ఎన్నికల కమిషన్​ షాక్​​.. పార్టీ గుర్తు స్తంభింపజేస్తూ నిర్ణయం

భవానీపూర్‌ నియోజకవర్గం 2011లో ఏర్పాటయింది. అక్కడ ఇప్పుడు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో రెండు సార్లు (2011, 2016) గెలిచారు. ఇప్పుడు మూడోసారి కూడా విజయం సాధించారు.  గతం కంటే ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలవడంతో టీఎంసీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. 2011లో 54,213 ఓట్ల మెజార్టీతతో గెలుపొందగా.. ఈసారి 58,832 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

YS Sharmila : తెలంగాణలో మరోసారి ప్రజా ప్రస్థానం పేరుతో.. షర్మిల పాదయాత్ర

కాగా, ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 294 అసెంబ్లీ సీట్లుండగా.. తృణమూల కాంగ్రెస్ పార్టీ 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక పశ్చిమ బెంగాల్‌ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబరు 3న వెల్లడిస్తారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగుతారు. ఓడిపోతే మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఐతే ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి.. సత్తాచాటారు మమతా బెనర్జీ.

First published:

Tags: Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal

ఉత్తమ కథలు