Bhabanipur Bypoll Result: ఆధిక్యంలో దూసుకెళ్తున్న మమతా బెనర్జీ.. కోల్‌కతాలో టీఎంసీ సంబరాలు

మమతా బెనర్జీ (File)

Mamata Banerjee: ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉపఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు మమత

  • Share this:
    Bhabanipur Bypoll Result: ఉత్కంఠ వీడింది. విజయం ఖాయమైంది. సీఎంగా కొనసాగాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన  ఉపఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సత్తాచాటారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై ఆమె స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ బరిలో నిలిచిన భవానీపూర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యంలో ఉన్నారు సీఎం మమతా బెనర్జీ. ఐదు రౌండ్లు ముగిసే సరికి సీఎం మమత 23,957 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మమతకు 28,355 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు కేవలం 4,398 ఓట్లు మాత్రమే వచ్చాయి.  సీపీఎం నేత శ్రీజిబ్ బిశ్వాస్‌కు 398 ఓట్లకే పరిమితమయ్యారు.

    ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉపఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు మమత. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సోవన్ దేబ్ ఛటర్జీ విజయం సాధించారు.  ఐతే మమత బెనర్జీ కోసం ఆయన రాజీనామా చేశారు. సెప్టెంబరు 30న పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్‌తో పాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ (Jangipur), సంషేర్ గంజ్ (Samserganj) స్థానాలకు పోలింగ్ జరిగింది. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal), సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ (Srijib Bishwas) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. భవానీపూర్‌లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో రెండు సార్లు (2011, 2016) గెలిచారు. మూడోసారి కూడా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు  తగ్గట్టే లీడింగ్‌లో ఉన్నారు మమత.

    Badvel By Election: బద్వేలులో పోటీకి బీజేపీ సై..? పవన్ సపోర్ట్ చేస్తారా..?

    విజయం వైపు దూసుకెళ్తున్న మమత బెనర్జీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సత్యమే గెలుస్తుందనడానికి మమతా బెనర్జీ విజయమే నిదర్శనమని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు.



    Bandi sanjay : భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

    కాగా, ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 294 అసెంబ్లీ సీట్లుండగా.. తృణమూల కాంగ్రెస్ పార్టీ 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక పశ్చిమ బెంగాల్‌ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబరు 3న వెల్లడిస్తారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగుతారు. ఓడిపోతే మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఐతే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం వైపు దూసుకెళ్తున్నారు మమతా బెనర్జీ.
    Published by:Shiva Kumar Addula
    First published: