వానపాములు, యడ్యూరప్ప, కుమారస్వామి.. ఆ ప్రశ్నకు ఈ మూడు ఆప్షన్లు.. సదరు టీచర్‌పై వేటు

who is farmer's friend : ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఆ ప్రశ్న వివాదాస్పదం కావడంతో సదరు టీచర్‌పై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. సదరు టీచర్‌ను పోస్టు నుంచి తొలగించినట్టు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర మీడియాతో వెల్లడించారు.

news18-telugu
Updated: March 29, 2019, 1:04 PM IST
వానపాములు, యడ్యూరప్ప, కుమారస్వామి.. ఆ ప్రశ్నకు ఈ మూడు ఆప్షన్లు.. సదరు టీచర్‌పై వేటు
సీఎం కుమారస్వామి, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప (File)
  • Share this:
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నాపత్రంలో రైతులకు సంబంధించిన ఓ ప్రశ్నలో వానపాములతో పాటు కర్ణాటక సీఎం, మాజీ సీఎం యడ్యూరప్పలను ఆప్షన్లుగా పేర్కొనడం వివాదంగా మారింది. అసలైన రైతు మిత్రులెవరు? అన్న ప్రశ్నకు మొదటి ఆప్షన్‌గా కుమారస్వామి పేరు, రెండో ఆప్షన్‌గా వానపాములు, మూడో ఆప్షన్‌గా యడ్యూరప్ప పేరును ఇచ్చారు. వార్షిక పరీక్షల్లో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు కన్నడ లాంగ్వేజ్ పేపర్‌లో ఈ ప్రశ్న ఇచ్చారు. దీంతో ప్రశ్నాపత్నం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఆ ప్రశ్న వివాదాస్పదం కావడంతో సదరు టీచర్‌పై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆ టీచర్‌ను పోస్టు నుంచి తొలగించినట్టు ప్రిన్సిపాల్ రాఘవేంద్ర మీడియాతో వెల్లడించారు. ప్రశ్నాపత్రంలో ఆ ప్రశ్న ఇచ్చినట్టుగా అడ్మినిస్ట్రేషన్ గమనించలేదని.. అందువల్లే పొరపాటు జరిగిందని తెలిపారు.కాగా, మాజీ సీఎం, బీజేపీ యడ్యూరప్ప తనను తాను తరుచుగా 'రైతు బంధు' అని చెప్పుకుంటారు. అటు ప్రస్తుత సీఎం కుమారస్వామి కూడా తనను తాను రైతు ఆప్తునిగా చెప్పుకుంటుంటారు. ఈ నేపథ్యంలో రైతు మిత్రుడెవరు? అంటూ స్కూల్ విద్యార్థుల పరీక్షల్లో ప్రశ్న రావడం చర్చనీయాంశంగా మారింది.


Published by: Srinivas Mittapalli
First published: March 29, 2019, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading