• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BENGALI ACTOR SRABANTI CHATTERJEE JOINS BHARATIYA JANATA PARTY IN KOLKATA SK

Srabanti Chatterjee: బీజేపీలో చేరిన మరో స్టార్ హీరోయిన్.. కమల దళంలో తారల సందడి

Srabanti Chatterjee: బీజేపీలో చేరిన మరో స్టార్ హీరోయిన్.. కమల దళంలో తారల సందడి

బీజేపీలో చేరిన స్రబంతి ఛటర్జీ

Srabanti Chatterjee Joins BJP: 33 ఏళ్ల స్రబంతి ఛటర్జీ ఇప్పటి వరకు 30కి పైగా బెంగాలీ చిత్రాల్లో నటించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. ప్రచారంలో బీజేపీ, టీఎంసీ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు నేతల జంపింగ్‌లు.. సెలబ్రిటీల చేరికలతో.. బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. సినీ నటులు, క్రీడా ప్రముఖకులు రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా బెంగాలీ స్టార్ హీరోయిన్ స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. కోల్‌కతాలో జరిగిన బీజేపీ ప్రచార సభ వేదికగా..ఆమె కమలం కండువా కప్పుకున్నారు.

    33 ఏళ్ల స్రబంతి ఛటర్జీ ఇప్పటి వరకు 30కి పైగా బెంగాలీ చిత్రాల్లో నటించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 25న బెంగాలీ నటి పాయెల్ సర్కార్ కూడా కాషాయ దళంలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే స్రబంతి కూడా బీజేపీ గూటికి చేరారు. బెంగాల్ రాజకీయాల్లో సినీ నటులు చాలా మంది ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు పలువురు నటులు టీఎంసీ తరపున బరిలోకి దిగి ఎంపీలుగా గెలిచారు. మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు.

    గత బుధవారం టీమిండియా మాజీ క్రికెటర్లు మనోజ్ తివారి, అశోక్ దిండా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మనోజ్ తివారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అశోక్ దిండా బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 8 దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ ఎన్నికలు - మార్చి 27న, రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17న, ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22న, ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం ఫలితాలతో పాటే మే2న బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: