ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు వెల్లువెత్తుతున్న మద్దతు.. స్వాగతించిన మమతా

SP BSP ALLIANCE: 25 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపిన ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని పొత్తును స్వాగతిస్తున్నాయి.

news18-telugu
Updated: January 12, 2019, 2:12 PM IST
ఎస్పీ-బీఎస్పీ పొత్తుకు వెల్లువెత్తుతున్న మద్దతు.. స్వాగతించిన మమతా
మాయావతి, మమతా బెనర్జీ(File)
  • Share this:
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీల కలయిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పొత్తును ఖరారు చేస్తూ శనివారం ఇరు పార్టీల అధినేతలు ప్రకటన చేయడమే ఆలస్యం.. దానికి మద్దతు వెల్లువెత్తుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్పీ-బీఎస్పీ పొత్తును స్వాగతిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కూడా పొత్తును స్వాగతించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పొత్తుల అవసరం ఉందని చెప్పారు. 2014లో ఇలాంటి పొత్తులు లేకపోవడం వల్లే ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడిందని అన్నారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది కేవలం 31% ఓట్లే అని గుర్తుచేశారు. అటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఎస్పీ-బీఎస్పీ పొత్తును స్వాగతించారు. బీజేపీ పతనం ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచే మొదలవుతుందన్నారు.

కాగా, 1993లో బీఎస్పీ చీఫ్ కాన్షీరాం, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నారని పొత్తుపై ప్రెస్‌మీట్ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి గుర్తుచేశారు. డా.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఇప్పుడు కూడా అవే ఫలితాలను సాధించాలనుకుంటున్నామని తెలిపారు.


First published: January 12, 2019, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading