ఫారెస్ట్ అధికారులను తరిమికొట్టండి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఫారెస్ట్ అధికారి అనిత మీద టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేసిన ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. అప్పుడు టీఆర్ఎస్ తీరును బీజేపీ తప్పుపట్టింది.

news18-telugu
Updated: July 20, 2019, 7:14 PM IST
ఫారెస్ట్ అధికారులను తరిమికొట్టండి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సోయం బాపురావు (File)
  • Share this:
తెలంగాణ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వస్తే ఫారెస్ట్ అధికారులను తరిమికొట్టాలంటూ ఆదివాసీలకు పిలుపునిచ్చారు. హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు మా జోలికొస్తే ఊరుకోబోమని సోయం బాపురావు హెచ్చరించారు. ఆదివాసీల హక్కుల కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ శాఖ అధికారి అనితపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు మరికొందరు ఆదివాసీలు దాడి చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ మీద కర్రలతో దాడి చేశారు. బీభత్సంగా కొట్టారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ నేతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కోనేరు కృష్ణ తన వైస్‌చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ ఘటనలో అటవీ శాఖ అధికారి అనిత తమను కులం పేరుతో దూషించిందంటూ కొందరు ఆదివాసీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. ఫారెస్ట్ సిబ్బంది మీద కూడా కేసు నమోదు చేశారు.

ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత.. ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎంపీ ఫారెస్ట్ అధికారులు వస్తే తరిమికొట్టండంటూ పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>