‘విశ్వాసం లేని కుక్క.. తెగిన చెప్పుతో కొట్టాలి’... కాంగ్రెస్ ఎంపీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

కార్యకర్తల నవ్వులను చూసి మంత్రి మరింత రెచ్చిపోయారు. ఈసారి కాంగ్రెస్ ఎంపీని పందితో పోల్చారు.

news18-telugu
Updated: September 25, 2019, 2:58 PM IST
‘విశ్వాసం లేని కుక్క.. తెగిన చెప్పుతో కొట్టాలి’... కాంగ్రెస్ ఎంపీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్రన్ బాలాజీ (Image:ANI)
  • Share this:
ప్రజలు ఎన్నుకున్న ఓ లోక్‌సభ సభ్యుడిని విశ్వాసం లేని కుక్క, తెగిన చెప్పుతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో నేత. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగోర్ మీద అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్ర బాలాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని నంగునూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ మీద దుర్భాషలాడారు. ‘నంగునూరు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢిల్లీలో కూర్చుని ఖరారు చేస్తున్నట్టుంది. మాణిక్యం ఠాగూర్ అనే ఓ పనికిమాలిన వ్యక్తి ఇప్పుడు ఎంపీ కూడా. ఈ సారి ఓట్లు అడగడానికి వస్తే తెగిన చెప్పులతో కొట్టండి.’ అని వ్యాఖ్యానించారు.

మంత్రి రాజేంద్ర బాలాజీ అంతటితో ఆగలేదు. తన నోటికి మరింత పదును పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంతవరకు నియోజకవర్గానికి కూడా రాలేదని కాంగ్రెస్ ఎంపీకి విశ్వాసం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ను ‘విశ్వాసం లేని కుక్క’గా అభివర్ణించారు. ‘ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాలేదు. గెలిచిన తర్వాత కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా రాలేదు. విశ్వాసం లేని కుక్క. ఢిల్లీలో కూర్చుంది. ఆయన కుటుంబం కూడా ఢిల్లీలోనే ఉంటుంది.’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కార్యకర్తల నవ్వులను చూసిమంత్రి మరింత రెచ్చిపోయారు. ఈసారి కాంగ్రెస్ ఎంపీని పందితో పోల్చారు. ‘మాణిక్యం కేవలం ఢిల్లీలో కూర్చుని పత్రికా ప్రకటనలు రిలీజ్ చేస్తుంటాడు. ఆ పంది ఇక్కడకు వస్తే కాల్చేయండి. సాధారణంగా పందులను చంపడానికి రబ్బర్ బుల్లెట్స్ వాడతాం. ఈ పందిని చంపడానికి మీరు కూడా రబ్బర్ బుల్లెట్స్ వాడండి.’ అని పిలుపునిచ్చారు. తమిళనాడులోని నంగునూరు, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ఖరారు చేసింది. విక్రవాండి నుంచి ముత్తమిళ సెల్వన్, నంగునూరు నుంచి రెడ్డియార్ పట్టి వి నారాయణన్ బరిలో దిగుతున్నారు. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు