నయీంతో సంబంధం లేదు... కేసు సీబీఐకు అప్పగించాలన్న మాజీ ఎమ్మెల్యే

నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.

news18-telugu
Updated: August 3, 2019, 3:23 PM IST
నయీంతో సంబంధం లేదు... కేసు సీబీఐకు అప్పగించాలన్న మాజీ ఎమ్మెల్యే
గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 3, 2019, 3:23 PM IST
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. నయీం బాధితుల పక్షాన తాను పోరాటం చేశానని ఆయన తెలిపారు. బీసీలు, బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న తన లాంటి వారిని ఇబ్బంది పెట్టేందుకే ఛార్జిషీట్‌లో తన పేరు పెట్టారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చిన అనేక మంది నాయకులు, ఉన్నతాధికారుల గురించి ఛార్జిషీట్‌లో ప్రస్తావన లేకపోవడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. నయీం కేసును సీబీఐకు అప్పగిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

నయీం ఎన్‌కౌంటర్ సమయంలో బయటపడ్డ డైరీని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. నయీం ఎన్’కౌంటర్ సమయంలో పెద్ద ఎత్తున డబ్బు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయని... వాటిని బాధితులకు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని అన్నారు.


First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...