కోడెల శివప్రసాదరావు మృతిపై బసవతారకం ఆస్పత్రి వివరణ

కోడెలకు బసవతారకం ఆస్పత్రిలో చికిత్స అందించడంపై ఏపీ మంత్రి బొత్స అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు.

news18-telugu
Updated: September 16, 2019, 5:32 PM IST
కోడెల శివప్రసాదరావు మృతిపై బసవతారకం ఆస్పత్రి వివరణ
కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: September 16, 2019, 5:32 PM IST
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వివరణ ఇచ్చింది. ఉదయం అపస్మారక స్థితిలో ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. గంటసేపు చికిత్స చేసినా స్పందించలేదని వైద్యులు చెప్పారు. ఊపిరితిత్తులు, గుండె పనిచేకపోవడంతో కోడెల చనిపోయినట్లు ధృవీకరించామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో కోడెల మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు బసవతారకం డాక్టర్లు. బసవతారకం ఇండో మెడికల్ ట్రస్ట్ బోర్డు ఫౌండర్, ఛైర్మన్‌గా కోడెల శివప్రసాదరావు సేవలు మరవలేనివన్నారు.

ఉదయం 11.35కి అపస్మారక స్థితిలో కోడెల శివప్రసాదరావును ఆస్పత్రికి తీసుకొచ్చారు. కోడెలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. కానీ పల్స్, బీపీ రికార్డవలేదు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయలేదు. గంటసేపు చికిత్స అందించినా స్పందించకపోవడంతో కోడెల చనిపోయినట్లు మధ్యాహ్నం 12.39కి ప్రకటించాం. శ్వాస ఆడకపోవడం ఆయన వల్లే చనిపోయి ఉండవచ్చు.
డాక్టర్ వీఎస్ రావు, డైరెక్టర్, బసవతారకం ఆస్పత్రి
మరోవైపు కోడెలకు బసవతారకం ఆస్పత్రిలో చికిత్స అందించడంపై ఏపీ మంత్రి బొత్స అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. కోడెల మృతిపై తెలంగాణ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...