Mangoes: ప్రధాని మోదీకి, సీఎం దీదీకి ప్రత్యేకమైన మామిడి పండ్ల బహుమతి.. ఎవరు పంపారో తెలుసా?

mangoes for modi and dhidhi

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా మారిన ప్రధాని మోదీ.. సీఎం దీదీకి మామిడి పండ్లను ప్రత్యేక బహుమతిగా పంపారు. ఇటీవల మమతా బెనర్జీ సైతం తన రాజకీయ ప్రత్యర్థులైన మోదీ, అమిత్ షాలకు మామిడి పండ్లను బహుమానంగా పంపారు.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీ.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇద్దరి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ముందు నుంచే వీరీ మధ్య వైరం ముదిరింది. అది ఇప్పుడు మరింత తీవ్రమైంది. కానీ వీరిద్దరికి ఇప్పుడు ప్రత్యేకమైన బహుమతి అందింది. 2600 కిలోల మామిడి పండ్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా అందాయి. ఈ ప్రత్యేకమైన పండ్లను బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్ హసీనా పంపారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే హరిభాంగా రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ఆ దేశ లారీల్లో రవాణా చేశారు. ఆ వాహనాలను భారత-బంగ్లా సరిహద్దుల్లోని బెనాపోల్ చెక్ పాయింట్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి అక్కడి నుంచి కోల్ కతా లోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ కార్యాలయానికి పంపారు.

    భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య స్నేహానికి చిహ్నంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ మామిడి పండ్లను ప్రధాని మోదీ, సీఎం మమతకు బహుమతిగా పంపారని బెనపోల్ కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ అనుపమ్ చక్మా తెలిపారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల సీఎంలకు కూడా మామిడి పండ్లను పంపే యోచనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇదీ చదవండి: అగ్రరాజ్యం అమెరికా ఐటి సంస్థ‌పై సైబ‌ర్ దాడి.. 500 కోట్ల రూపాయల డిమాండ్

    గత వారం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ.. తమ రాష్ట్రంలో పండే విభిన్న రకాల మామిడి పండ్లను తన రాజకీయ ప్రత్యర్ధులైన ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, విపక్ష కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా పలువురు నేతలకు పంపారు. ఏడాది పొడవునా ఎన్ని రాజకీయాలు చేసినా ప్రతి ఏటా వేసవిలో మామిడి పండ్లను మాత్రం ఢిల్లీలో సహచర రాజకీయ నేతలకు పంపడం ద్వారా మమతా బెనర్జీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

    ఇదీ చదవండి: ఏపీ పోలీస్ శాఖలో 15000 మంది రిక్రూట్.. మహిళా సంరక్షణే ధ్యేయమన్న డీజీపీ
    Published by:Nagesh Paina
    First published: