మళ్లీ పవన్‌కు జై కొట్టిన బండ్ల గణేశ్... అదే కారణమా ?

బండ్ల గణేశ్ ఉన్నట్టుండి మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై కొట్టడానికి కారణం ఏమటన్నది హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: January 26, 2020, 8:17 PM IST
మళ్లీ పవన్‌కు జై కొట్టిన బండ్ల గణేశ్... అదే కారణమా ?
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా పవన్ ఎప్పుడో అన్న మాట ఉన్న జనసేన పోస్టర్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసారు బండ్ల గణేశ్. అందులో “నేను భయంతో రాలేదు – బాధ్యతతో వచ్చాను” అన్న లైన్ ఉంది.ఈ మాటను “ఇది నిజం” అంటూ పవన్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీంతో బండ్ల గణేశ్ ఉన్నట్టుండి మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై కొట్టడానికి కారణం ఏమటన్నది హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తెరకెక్కించిన బండ్ల గణేశ్... రాజకీయాల్లోనూ ఆయనతో కలిసి నడుస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ‌పార్టీలో చేరారు.అయితే ఆయన తన నోటి దురుసు కారణంగా నెటిజన్లు, పార్టీలోనూ పలుచన అయ్యారనే అపవాదు ఉంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్లీ ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్... హఠాత్తుగా మరోసారి పవన్ కళ్యాణ్‌ను గట్టిగా సపోర్ట్ చేయడం వెనుక కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు