తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్...

ప్రతీకాత్మక చిత్రం

బీజేపీని తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలంటే... తన టీమ్‌లోనూ మార్పులు చేయాలనే యోచనలో బండి సంజయ్ ఉన్నారని తెలుస్తోంది.

 • Share this:
  తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడంతో... ఆయన ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళతారో అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కాస్త దూకుడుగా ముందుకెళ్లే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీ పగ్గాలు అప్పగించింది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించే విషయంలో బండి సంజయ్ ఏ మాత్రం వెనుకడుగు వేయరనే విషయం ఆయన వ్యవహారశైలి గురించి తెలిసినవారందరికీ తెలుసు. అయితే ఇందుకోసం ఆయన తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకుంటారా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

  పార్టీ చీఫ్‌గా బండి సంజయ్ రావడంతో... ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల పదవుల్లో మార్పులు ఉంటాయా ? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీమ్‌లో లక్ష్మణ్ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారనే టాక్ ఉంది. దీంతో బండి సంజయ్ వీరిలో చాలామందిని మారుస్తారా ? లేక కంటిన్యూ చేస్తారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

  Bjp, telangana, telangana news, telangana politics, bandi sanjay, Karimnagar, telangana bjp, బీజేపీ, తెలంగాణ, తెలంగాణ న్యూస్, తెలంగాణ న్యూస్, తెలంగాణ పాలిటిక్స్, బండి సంజయ్, కరీంనగర్, తెలంగాణ బీజేపీ
  బండి సంజయ్(ఫైల్ ఫోటో)


  బీజేపీని తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలంటే... ఈ టీమ్‌లోనూ మార్పులు చేయాలనే యోచనలో బండి సంజయ్ ఉన్నారని... ఇందుకోసం ఆయన ఇప్పటికే కసరత్తు చేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే... ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కొన్ని పదవుల్లో ఉన్నవారికి స్థానచలనం తప్పకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టడంతో... ఆ పార్టీలోని కొందరు నేతల్లో టెన్షన్ మొదలైందనే వార్తలు జోరందుకున్నాయి.
  Published by:Kishore Akkaladevi
  First published: