కేసీఆర్ అలా చేయకపోతే హిందూ సమాజం క్షమించదు : బండి సంజయ్

యాదాద్రి ఆలయ ప్రాకారాలపై తన ఫోటోలు చెక్కించుకున్న కేసీఆర్‌.. చర్చిలో, మసీదుల్లో కూడా ఇలానే చేయగలరా? అని ప్రశ్నించారు.పవిత్రమైన ఆలయంలో కేసీఆర్‌ తన ఫోటోలు, పార్టీ ఫోటోలు ప్రదర్శించడం దారుణమన్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 4:02 PM IST
కేసీఆర్ అలా చేయకపోతే హిందూ సమాజం క్షమించదు : బండి సంజయ్
బండి సంజయ్ (File Photo)
  • Share this:
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అష్టభుజి ప్రాకారాలపై సీఎం కేసీఆర్ ముఖచిత్రం,టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, ప్రభుత్వ పథకాల చిహ్నాలను చెక్కించడంపై రాష్ట్రంలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముఖచిత్రంతో పాటు ఇందిరా గాంధీ,నెహ్రూ,కమలం చిహ్నాలను కూడా ప్రాకారాలపై చెక్కించారని టీఆర్ఎస్ శ్రేణులు సమర్థించుకుంటుంటే.. ప్రత్యర్థి పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

యాదాద్రి ఆలయ ప్రాకారాలపై తన ఫోటోలు చెక్కించుకున్న కేసీఆర్‌.. చర్చిలో, మసీదుల్లో కూడా ఇలానే చేయగలరా? అని ప్రశ్నించారు.పవిత్రమైన ఆలయంలో కేసీఆర్‌ తన ఫోటోలు, పార్టీ ఫోటోలు ప్రదర్శించడం దారుణమన్నారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందుగాళ్లు బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పుడిలా ఏకంగా ఆలయంలోనే తన ఫోటోలు పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజంగా హిందూ ధర్మం పట్ల,దేవుడి పట్ల చిత్తశుద్ది ఉంటే.. యాదాద్రి వెళ్లి అర్చుకులతో కలిసి ఫోటోలు తొలగించి పాలాభిషేకం చేయాలని సూచించారు. అప్పుడే హిందూ సమాజం ఆయన్ను క్షమిస్తుందన్నారు. లేదంటే కేసీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదని సంజయ్ హెచ్చరించారు.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading