ఎన్నికల ప్రచారంలో స్రృహ తప్పి పడిపోయారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కరీంనగర్‌లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రస్తుతం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీజేపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ కరీంనగర్ నుంచి రేసులో ఉన్నారు. సంస్థాగతంగా ఇక్కడ బీజేపీకి పట్టుండడం..స్థానికంగా బండి సంజయ్‌కు మంచి పేరు ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. స్థానిక యువతతో కలిసిపోయి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని ఆయనకు పేరుంది. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మే 23న తేలనుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండి సంజయ్ ఫొటోలు..
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.