Telangana BJP: రూటు మార్చిన బీజేపీ... రేసులో కొత్త నేతలు ?

తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: February 21, 2020, 12:25 PM IST
Telangana BJP: రూటు మార్చిన బీజేపీ... రేసులో కొత్త నేతలు ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ ఎవరు ? ఇదే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిరేపుతున్న అంశం. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని పదే పదే చెప్పుకుంటున్న బీజేపీ... టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే సారథి కోసం అన్వేషిస్తోంది. అయితే ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తుండగా... ఓ ఇద్దరి పేర్లు బీజేపీ హైకమాండ్ దగ్గర తుది ఎంపిక కోసం సిద్ధంగా ఉన్నాయని మరికొందరు చర్చించుకుంటున్నారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌నే మరోసారి ఈ పదవిలో కొనసాగించే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా... బీజేపీ శ్రేణులు మాత్రం కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.

ఇందుకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని సమాచారం. దీంతో తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో దూకుడుగా ముందుకు వెళుతుండటంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం వీరికి కలిసొచ్చే అంశమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఇద్దరు ఎంపీలు ? | Bandi sanjay and dharmapuri Arvind in telangana bjp state president race ak
ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్(ఫైల్ ఫోటో)


ఈ నెల 25 నాటికి ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే సత్తా వీరిద్దరిలో ఉందని కొందరు బీజేపీ నేతలు సైతం బలంగా నమ్ముతున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌గా ఎవరు ఎంపికవుతారనే అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు