గోపీచంద్ మలినేని ఇంట రాజకీయంగా ఆసక్తికర ఘటన..

దర్శకుడు గోపీచంద్ మలినేని తండ్రి దశదిన కార్యక్రమానికి ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు.

news18-telugu
Updated: August 15, 2019, 4:39 PM IST
గోపీచంద్ మలినేని ఇంట రాజకీయంగా ఆసక్తికర ఘటన..
గోపీచంద్ మలినేని తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో మంత్రి బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
  • Share this:
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం బొద్దులూరివారి పాలెం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ నేతల కలయిక ఆసక్తిగా మారింది. బొద్దులూరివారి పాలెంలో సినీ దర్శకుడు మలినేని గోపిచంద్.. తండ్రి దశ దిన కర్మకి కార్యక్రమం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఒంగోలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని బొద్దులూరి వారి పాలెం వచ్చారు. అదే సమయంలో చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా అక్కడికి వచ్చారు. టీడీపీ, వైసీపీ నేతలు ఇరువురూ ప్రైవేట్ కార్యక్రమంలో నవ్వుతూ పలకరించుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ రోజు ఉదయం చీరాలలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరణం బలరాంని... వైసీపీ నేత ఆమంచి వర్గీయులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన జరిగిన కొద్దీ గంటల్లోనే మంత్రి బాలినేని, కరణం బలరాం ప్రైవేట్ కార్యక్రమంలో కలసి రాజకీయాలకు సంబంధం లేకుండా... పలకరించుకోవడాన్ని స్థానికులు కూడా ఆసక్తిగా తిలకించారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి, కరణం బలరాం


ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచికి, కరణం బలరాంకి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడిన ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ టికెట్ మీద పోటీ చేశారు. అయితే, టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కరణం, ఆమంచి మధ్య నియోజకవర్గంలో తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఇటీవల గ్రామ వాలంటీర్ల నియామకాల విషయంలో అధికారులను కరణం బలరాం బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మీద బాలినేనికి ఆమంచి ఫిర్యాదు కూడా చేశారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading