నేడు అమరావతిలో బాలయ్య పర్యటన.. కూతురితో కలిసి..

ఏపీ రాజధాని గ్రామాల్లో నేడు నటుడు బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతులకు సంఘీభావం తెలుపుతారు.

news18-telugu
Updated: January 16, 2020, 7:30 AM IST
నేడు అమరావతిలో బాలయ్య పర్యటన.. కూతురితో కలిసి..
నందమూరి బాలకృష్ణ (ఫైల్)
  • Share this:
ఏపీ రాజధాని గ్రామాల్లో నేడు నటుడు బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతులకు సంఘీభావం తెలుపుతారు. ఆయనతో పాటు ఆయన భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేశ్ కూడా రానున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరాహార దీక్ష శిబిరాలను బాలయ్య సందర్శించి, రైతుల నిరసనలకు, ధర్నాలకు మద్దతు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. అమరావతి రైతులకు మద్దతుగా నారా రోహిత్, నిర్మాత అశ్వనీదత్, పాప్ సింగర్ స్మిత సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
నారా బ్రాహ్మణి(ఫైల్)


కాగా, రాజధాని రైతుల ఆందోళనలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు వెలగపూడిలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పండగ పూట కూడా పస్తులుండి రైతులు నిరసనలు తెలిపారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా ఇతర గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిని మూడు ముక్కలు చేయొద్దంటూ, అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్నారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>