చంద్రబాబు మాట వినని బాలకృష్ణ

వైసీపీ హవాలోనూ హిందూపురంలో విజయం సాధించిన బాలకృష్ణకు ఈ బాధ్యతలు అప్పగిస్తే... సత్ఫలితాలు వస్తాయని టీడీపీ అధినేత యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: December 2, 2019, 3:08 PM IST
చంద్రబాబు మాట వినని బాలకృష్ణ
చంద్రబాబు, బాలకృష్ణ (chandrababu balakrishna)
  • Share this:
గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీని మళ్లీ గాడిన పెట్టేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తానే స్వయంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న చంద్రబాబు... క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. అయితే టీడీపీలో మళ్లీ జవసత్వాలు నింపేందుకు తనతో పాటు బాలకృష్ణను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా టీడీపీ దారుణంగా దెబ్బతిన్న రాయలసీమలో మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతను బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు అనుకున్నారు.

వైసీపీ హవాలోనూ హిందూపురంలో విజయం సాధించిన బాలకృష్ణకు ఈ బాధ్యతలు అప్పగిస్తే... సత్ఫలితాలు వస్తాయని టీడీపీ అధినేత యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు బాలకృష్ణ నో చెప్పినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కడప పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... తాజాగా కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో పార్టీ వ్యవహారాల బాధ్యతలు తీసుకునేందుకు బాలకృష్ణ విముఖత వ్యక్తం చేయడం వల్లే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల నాటికి సీమ రాజకీయాలపై బాలకృష్ణ దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: December 2, 2019, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading