నమ్మలేకపోతున్నాను... కోడెల మృతిపై ఉద్వేగంలో బాలకృష్ణ

బాలయ్య ఫైల్ ఫోటో

కోడెల ఇక లేరంటే నిజంగా నమ్మలేకపోతున్నానని ఉద్వేగానికి లోనయ్యారు బాలకృష్ణ.

  • Share this:
    మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. మంత్రిగా, ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా ఆయన ఎన్నో పదవుల్ని అలంకరించారన్నారు. ఆయన ఏ పదవిని అలంకరించినే ఆ పదవికి హుందా తనం తెచ్చారన్నారు బాలయ్య. ప్రజల గుండెల్లో కోడెల శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. కోడెల ఇక లేరంటే నిజంగా నమ్మలేకపోతున్నానని ఉద్వేగానికి లోనయ్యారు బాలకృష్ణ.
    ఆయన మరణ వార్త విని వెంటనే ఆస్పత్రికి వచ్చానన్నారు. బసవతరాకం ఆస్పత్రితో కూడా కోడెలకు ఎంతో అనుబంమన్నారు. ఇక్కడున్న ప్రతీ ఇటుక, ప్రతీ సిబ్బందితో ఆయనకు ఎంతో అనుబందముందన్నారు బాలయ్య. భగవంతుడు అన్యాయం చేశాడన్నారు. ఆయన ఆత్మ శాంతించాలని.. కోడెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతి టీడీపీకి కూడా తీరని నష్టమన్నారు .
    Published by:Sulthana Begum Shaik
    First published: