Home /News /politics /

BALAKRISHNA NARA LOKESH START CAMPAIGN IN AP MUNICIPAL ELECTIONS NGS

Municipal Elections: ఒకే రోజు బరిలో మామా అల్లుడు.. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఇద్దరే స్టార్ క్యాంపైనర్లు

టీడీపీ నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. అందులో ఒకరు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రెండో వ్యక్తి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

టీడీపీ నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. అందులో ఒకరు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రెండో వ్యక్తి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

ఏపీ మున్సిపల్ ఎన్నిల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు బాద్యతను తమపై వేసుకున్నారు మామా అల్లుడు.. అందుకే ఇద్దరూ ఒకే రోజు ప్రచార బరిలో దిగారు. హిందూపురం నుంచి బాలయ్య.. విశాఖ నుంచి లోకేష్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

  ఏపీ పంచయాతీ ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ తారుమారు చేసిందని టీడీపీ బయటకు చెబుతున్నా.. పార్టీలో మాత్రం అంతర్మథనం కొనసాగుతోంది. టీడీపీ ఊహించినదానికంటే వైసీపీ అత్యధిక సీట్లు సాధించింది. చాలాచోట్ల టీడీపీ మద్దతు దారులకు డిపాజిట్ లేని పరిస్థితి కనిపించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని  చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సాధారణంగా పల్లె ఓటు బ్యాంకుతో పోలిస్తే పట్టణ ఓటర్లలో టీడీపీకి కొంత పట్టు ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్లుగా మామా, అల్లుడు ఇద్దరిని బరిలో దించారు చంద్రబాబు.. అయితే ఇద్దరు ఒకే రోజు ప్రచారాన్ని మొదలెట్టారు..

  గ్రేటర్ విశాఖకు 14 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతుండడంతో.. టీడీపీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పక్కా గెలిచేందుకు అవకాశం ఉంది అనుకుంటున్న వాటిలో విశాఖ గ్రేటర్ పీఠం ఒకటి. ఎందుకంటే ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న పరిణామాలు టీడీపీ కాస్త అనూకూలంగా మారుతున్నాయి. దానికితోడు నగరంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో పట్టు నిలుకుంటే విజయం సాధించడం సమస్య కాదు. అందుకే ఒక్క అవకాశాన్ని కూడా టీడీపీ వదులుకోదలుచుకోలేదు. వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా.. టీడీపీ తమ మేయర్ అభ్యర్థిపై కేడర్ కు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది కూడా. పీలా శ్రీనివాస్ ను మేయర్ గా ప్రకటించి ప్రచారం చేస్తోంది.

  మరోవైపు విశాఖ మేయర్ పీఠాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న టీడీపీ తమ స్టార్ క్యాంపనైర్ గా లోకేష్ ను బరిలో దిపింది. ఇప్పటికే లోకేష్ విశాఖలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మొదట విశాఖలోని సింహాచలం దేవాస్థానంలో నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ వెంటనే ప్రచార బరిలో దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రాంతమైన గాజువాక నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను తయారు చేశామన్నారు లోకేష్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెంచుతామన్న ఇంటిపన్నును రద్దు చేస్తామన్నారు.

  సీఎం జగన్ రెడ్డి రెండు వైపులా ఉంటారని లోకేష్ విమర్శించారు. ఒకవైపు మూడు రాజధానులు అంటారని, మరోపక్క విశాఖకు కార్యాలయాలు తరలిస్తారని అన్నారు. ఏ2 విజయసాయిరెడ్డికి విశాఖలో ఏం పని? ప్రశ్నించారు. విశాఖలో దోచుకోడానికి వచ్చారా? అని నిలదీశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే గంటా పార్టీ మార్పు ప్రచారంపైనా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.

  ఓ వైపు అల్లుడు విశాఖ ప్రచారంలో తొడ కొడుతుంటే.. హిందూపురంలో  మీసం మెలేసేందుకు బాలయ్య రెడీ అయ్యారు. మొన్నటి పంచాయతి ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ అత్యధిక వార్డుల్లో విజయం సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో అలా జరగకూడదని భావిస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగబోతుండటంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  హిందూపురం మున్సిపాలిటీలో బాలకృష్ణ ప్రచార బరిలోకి దిగారు కూడా.  ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఇప్పటికే ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా ఒకే రోజు టీడీపీ తరుపున మామా అల్లుడు ఇద్దరూ ప్రచార బరిలోకి దిగడంతో టీపీడీ కేడర్ లో ఉత్సాహం పెరిగింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Ap local body elections, Balakrishna, Hindupuram, Municipal Elections, Nara Lokesh, Tdp, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు