బాలకృష్ణ ఫ్యాన్స్‌తో అలాగే ఉంటారు... విషయం చెప్పేసిన భార్య వసుంధర

అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించినా, తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుందన్నారు వసుంధర.

news18-telugu
Updated: April 8, 2019, 1:32 PM IST
బాలకృష్ణ ఫ్యాన్స్‌తో అలాగే ఉంటారు... విషయం చెప్పేసిన భార్య వసుంధర
హిందూపురంలో ఇంటింటికి ప్రచారంలో బాలకృష్ణ సతీమణి వసుంధర..
  • Share this:
ఏపీలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. రెండు రోజులే మిగిలి ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు.ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే. సినీ నటుడు బాల‌కృష్ణ కూడా పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఆయన తన అభిమానులు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తన అభిమానులపై బాలయ్య నోరుపారేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఇది బయటపడింది కూడా. అయితే తాజాగా బాలయ్య వ్యవహారంపై భార్య వసుంధరా దేవి స్పందించారు. తన అభిమానులతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నారు వసుంధర. అయితే కొన్నిసార్లు ఫ్యాన్స్ తప్పుగా ప్రవర్తించినా, తప్పులు చేసినా ఆయనకు కోపం వస్తుందన్నారామె. అభిమానులతో ఉన్న చనువతోనే, మనవాళ్లు అన్న అభిమానంతోనే బాలయ్య అలా ఉంటారన్నారు. బాలకృష్ణ ఏమన్న ఆయన ఫ్యాన్స్‌కూడా ఏమీ అనుకోరన్నారు వసుంధర. ఆయనంటే పడనివాళ్లు మాత్రమే దీన్ని వేరేరకంగా హైలైట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరన్నారు వసుంధర. బసవతారకం ఆసుపత్రికి ఎవరు వచ్చినా చికిత్సను నిరాకరించలేదు. డబ్బులున్నా, లేకపోయినా, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు వచ్చినా, రాకపోయినా అందరికి చికిత్స అందేలా బాలకృష్ణ చొరవ తీసుకుంటారని వసుంధర తెలిపారు. నందమూరి బాలకృష్ణ విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడ ఓ అభిమాని మీద దాడి చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు వెనక్కి పరుగు పెట్టాడు. అయినా బాలయ్య అతడి వెంట పరిగెత్తుకుని వచ్చి దాడి చేశాడు. సుమారు 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలయ్య అస్పష్టంగా కనిపిస్తున్నాడు. అయితే, అసలు అభిమానిని బాలకృష్ణ ఎందుకు కొట్టాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవికూడా చదవండి: 

Viral Video: అభిమానిని వెంటపడి కొట్టిన నందమూరి బాలయ్య?రోజూ బయటకెళ్తుంటే దేవాన్ష్ అడిగేవాడు.. నా కష్టం తెలియాలనే ఇక్కడికి తీసుకొచ్చా : చంద్రబాబు
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు