బాలకృష్ణ స్నేహితుడు టీడీపీకి షాక్ ఇస్తారా ?

తనకు కనిగిరి సీటు కేటాయించకుండా దర్శి అసెంబ్లీ కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆగ్రహంగా ఉన్నారు. కనిగిరి నుంచే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో బాబూరావు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: March 29, 2019, 9:13 PM IST
బాలకృష్ణ స్నేహితుడు టీడీపీకి షాక్ ఇస్తారా ?
నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)
  • Share this:
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి టికెట్ల కేటాయింపు తరువాత కూడా టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు అభ్యర్థులు పార్టీని వీడి వైసీపీలోకి వెళుతుంటే... బుడ్డా రాజశేఖర్ రెడ్డి వంటి వారు తాము పోటీ చేయలేమని సైలెంట్‌గా తప్పుకుంటున్నారు. తాజాగా తన సిట్టింగ్ సీటు కాకుండా వేరే అసెంబ్లీ సీటు కేటాయించారని టీడీపీ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్న కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావుకు ఈ సారి దర్శి నుంచి సీటు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

కనిగిరి నుంచి ఇటీవల టీడీపీలో చేరిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి అవకాశం కల్పించారు. దీనిపై కదిరి బాబూరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనిగిరి సీటు మళ్లీ తనకే ఇవ్వాలని బాబూరావు టీడీపీకి గతంలోనే స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. సినీనటుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబూరావు... ఈ విషయంలో బాలయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తాను అనుకున్నది చేశారు.

దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కనిగిరి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని కదిరి బాబూరావు భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కదిరి బాబూరావును బుజ్జగించేందుకు బాలకృష్ణ కుటుంబసభ్యులు రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సిట్టింగ్ సీటు దక్కకపోవడంతో అలక వహించిన టీడీపీ ఎమ్మెల్యే... సొంత పార్టీకి షాకిచ్చి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా లేక బాలయ్య బుజ్జగింపులతో మెత్తబడతారా అన్నది చూడాలి.
First published: March 19, 2019, 3:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading